Breaking News

ప్రైవేట్‌ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్‌!

Published on Sun, 11/23/2025 - 08:29

సాక్షి,న్యూఢిల్లీ: ప్రైవేట్‌ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు ఏడాదికి పెయిడ్‌ లీవ్స్‌ పొందేందుకు ఉద్యోగి కనీసం 240 పనిదినాలు పూర్తి చేయాలి. కొత్త కార్మిక చట్టాల ప్రకారం.. ఈ అర్హతకు కావాల్సిన పనిదినాల సంఖ్యను 180 రోజులకు తగ్గించింది. దీంతో ఉద్యోగులు అత్యవసర పరిస్థితుల్లో సెలవులు తీసుకున్నా వాటికి జీతం పొందే అవకాశం మరింత సులభతరమైంది. 
  
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ఇప్పటివరకు అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాలను హేతుబద్ధం చేసింది. బదులుగా ఉద్యోగుల శ్రేయస్సే లక్ష్యంగా వాటి స్థానంలో  కొత్తగా నాలుగు కార్మిక చట్టాలను అందుబాటులోకి తెచ్చింది. తద్వారా ఉద్యోగి రోజు వారీ పని గంటలు, పొందే వేతనంతో పాటు హెల్త్‌ బెన్ఫిట్స్‌లలో మార్పులు చోటు చేసుకున్నాయి.

పని గంటలు
ప్రతి సంస్థలో సాధారణంగా రోజుకు ఎనిమిది గంటలు వారానికి 48గంటలు పనిచేసే నిబంధన అలాగే కొనసాగుతోంది. కొత్తగా అమల్లోకి వచ్చిన కార్మిక చట్టాలతో  వారంలో పనిచేసే పనిదినాల సంఖ్యను తగ్గించి పని గంటల్ని పెంచింది. అలా

వారంలో నాలుగు రోజుల వర్కింగ్‌ డే కోసం - రోజుకు 12 గంటలు
వారంలో ఐదు రోజుల వర్కింగ్‌ డే కోసం- రోజుకు 9.5 గంటలు
వారంలో ఆరు రోజుల వర్కింగ్‌ డే కోసం - రోజుకు 8 గంటలు

ఓవర్‌టైమ్: ఉద్యోగి ఒప్పుకుంటే అదనపు గంటలు పనిచేయించుకోవచ్చు. అందుకు పని చేసిన గంటలకు  రెండు రెట్లు చెల్లించాలి. ముందున్న 75 గంటల ఓవర్‌టైమ్ పరిమితి తొలగించింది. రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక అవసరాల ప్రకారం కొత్త కార్మిక చట్టాల ప్రకారం అదనపు గంటలకు వేతనం చెల్లించాల్సి ఉంటుంది.

ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షలు
40 ఏళ్ల పైబడిన ప్రతి ఉద్యోగికి ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్ష తప్పనిసరి. దీని ద్వారా అనారోగ్యాన్ని ముందుగానే గుర్తించడం, వైద్య ఖర్చులను తగ్గించడం హాజరు లోపాలను తగ్గించడం లక్ష్యం. ప్లాంటేషన్‌ విభాగంలో పనిచేసే కార్మికులకు ఈఎస్‌ఐసీ వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.

ఆ రంగాల్లోని ఉద్యోగుల కోసం 
తయారీ, టెక్ట్స్‌టైల్స్‌, రిటైల్‌, నిర్మాణ రంగాల్లో పనిచేసే కార్మికుల కోసం పెయిడ్‌ లీవ్స్‌లో మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఉద్యోగులు ఏడాది కాలంలో పెయిడ్‌ లీవ్స్‌ పొందేందుకు 240 పని దినాలు పూర్తి చేయాలి. ఆమొత్తం సంఖ్యను 180కి కుదించింది. 

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)