Breaking News

రైల్లో యాచకుడు.. మూడు ఆటోలకు యజమాని

Published on Tue, 10/15/2024 - 13:20

మధుబని: ఎవరైనా ఇష్టంగా ఒక వృత్తిలో చేరాక దానిని మానివేయడం కష్టంగా మారుతుందని అంటారు. ఇదేవిధంగా యాచనను వృత్తిగా ఎంచుకున్న ఒక వ్యక్తి మూడు ఆటోలకు ఓనర్‌గా మారాడు. బీహార్‌లోని దర్భంగా, మధుబని రైల్వే సెక్షన్‌లో భిక్షాటన సాగించే బంభోలా అలియస్‌ సూరదాస్ ఇప్పడు వార్తల్లో నిలిచాడు.

సూరదాస్ 25 ఏళ్ల క్రితం రైలులో భిక్షాటన చేయడం ప్రారంభించాడు. అంధత్వం కలిగిన సూరదాస్‌ రైలులో పాటలు పాడుతూ యాచిస్తుంటాడు.  తాను ఏ పనీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని, తనకు భిక్షాటన మాత్రమే ఆసరా అని సూరదాస్ మీడియాకు తెలిపాడు. యాచనే తనకు జీవితమని పేర్కొన్నాడు.

ఇప్పుడు సూరదాస్‌ కథ భిక్షాటనకే పరిమితం కాలేదు. ఇప్పుడు అతను మూడు ఆటోలకు యజమాని. తనకు వచ్చే ప్రతీపైసా కూడబెట్టి ఆటోలను కొనుగోలు చేసినట్లు సూరదాస్‌ తెలిపాడు. తన యాచనతో వచ్చిన సంపాదనతోనే కుటుంబం నడుస్తుందని, యాచనను తన ఊపిరి ఉన్నంతవరకూ కొనసాగిస్తానని తెలిపాడు. కష్టాలు ఎదురైనా మనిషి తన కలలను  నెరవేర్చుకునేందుకు కృషి చేయాలని ఆయన చెబుతుంటాడు. 

ఇది కూడా చదవండి: కనువిందు చేస్తున్న విదేశీ వలస పక్షులు

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)