Breaking News

ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!

Published on Tue, 05/07/2024 - 13:47

దేశంలో ఈరోజు(మంగళవారం) లోక్‌సభ ఎన్నికల్లోని మూడో దశ పోలింగ్‌ జరుగుతోంది. ఈ నేపధ్యంలో కొన్ని చోట్ల అనూహ్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్‌లోని అరా పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో నిలుచున్న ఓటర్లపై  తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో గాయపడిన ఎనిమిదిమంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని ఆసుపత్రిలో జష్పూర్ ఎమ్మెల్యే  పరామర్శించారు.

ఈరోజు ఉదయం 7 గంటలకు జష్ఫూర్‌ జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రారంభమైంది. తొలుత 85 ఏళ్ల విద్యావతి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. పెట్రోలింగ్ బృందాన్ని నియమించారు. ఎండ వేడిని దృష్టిలో ఉంచుకుని  ఓటర్లకు నీడ కల్పించే ఏర్పాట్లు చేశారు.  జష్పూర్ జిల్లా పరిధిలో 878 పోలింగ్ స్టేషన్లు  ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్‌ బూత్‌లో నలుగురు ఉద్యోగుల బృందం విధులు  నిర్వహిస్తుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)