Breaking News

మహిళా న్యాయవాదులకు 30శాతం రిజర్వేషన్లు కల్పించండి 

Published on Fri, 12/05/2025 - 05:36

న్యూఢిల్లీ: రాష్ట్ర బార్‌కౌన్సిల్‌ ఎన్నికల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బార్‌ కౌన్సిల్‌ ఆ‹ఫ్‌ ఇండియా (బీసీఐ)కి సుప్రీంకోర్టు సూచించింది. ‘రాష్ట్ర బార్‌కౌన్సిల్‌లలో 30శాతం రిజర్వేషన్లు కల్పించే విధంగా బీసీఐ నియమాలను రూపొందిస్తుందని ఆశిస్తున్నాం. కొన్ని ఆఫీస్‌ బేరర్‌ పోస్టులు కూడా అందుబాటులో ఉండాలి ’ప్రదాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టి‹స్‌ జోయ్‌ మాల్యా బాగి్చలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 

రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌లలో మహిళా ప్రాతినిధ్యం తప్పనిసరి చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం అటువంటి రిజర్వేషన్లను అమలు చేయడానికి అడ్వకేట్స్‌ చట్టానికి సవరణలు అవసరమని బీసీఐకి తెలిపింది. అయితే రాష్ట్రాల బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల ప్రక్రియలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, తక్షణ మార్పులు కష్టమని బీసీఐ తరపు న్యాయవాది గురుకుమార్‌ ధర్మాసనానికి తెలిపారు. 

అంతేకాదు.. మహిళా న్యాయవాదులు పోటీ చేయడంపై ఆయన అనుమానం వ్యక్తం చేయగా.. మహిళా న్యాయవాదుల సర్వే ఆధారంగా సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ నిర్వహించిన వర్క్‌షా‹ప్‌ను ధర్మాసనం ప్రస్తావించింది. 83 మంది శాతం మహిళా న్యాయవాదులు బీసీఐలో సభ్యులుగా ఉండాలని కోరుకుంటున్నారని వెల్లడించింది. ఒక ఆఫీ‹స్‌ బేరర్‌ పదవిని మహిళా న్యాయవాదులకు రిజర్వ్‌ చేయాలని సూచించింది.  
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)