Breaking News

సీనియర్‌ వేధింపులు.. రాలిన విద్యా కుసుమం

Published on Sun, 10/19/2025 - 13:51

సాక్షి, బెంగళూరు: భార్యను చంపిన భర్త, యువతిని చంపిన దుండగుడు.. ఇంతలోనే బెంగళూరులో మరో దుర్ఘటన జరిగింది. సీనియర్‌ వేధింపులను తాళలేక బాగలూరులో ఓ పీజీ హాస్టల్లో విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని సనా పర్వీన్‌ (19)గా గుర్తించారు. సనా మరణానికి కాలేజీలో సీనియర్‌ రిఫాన్‌ వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. సనా చదివే కాలేజీలోనే రిఫాన్‌  చదువు పూర్తి చేసుకుని కాలేజీ వదిలి వెళ్లిపోయాడు. 

అయినప్పటికీ సనాకు వేధింపులు ఆపలేదు. కేరళకు చెందిన రిఫాన్‌ గత పది నెలల నుంచి తరచుగా కాలేజీకి వచ్చి వెళ్లేవాడు. పీజీ వద్దకు కూడా వచ్చి సనాను ప్రేమ పేరుతో ఒత్తిడి చేసేవాడు. పలుమార్లు కాలేజీలో గొడవలు కూడా జరిగినట్లు ఆమె స్నేహితులు తెలిపారు. ఇది తట్టుకోలేక ఆమె పీజీలోని గదిలో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పై బాగలూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది.  

మహిళా సంఘాల నిరసన 
మరోవైపు మహిళలకు, యువతులకు భద్రత కల్పించాలని, దౌర్జన్యాలను అరికట్టాలని ఏఐడీఎస్‌ఓ సహా పలు స్త్రీవాద, వామపక్ష సంఘాల కార్యకర్తలు బెంగళూరు ఫ్రీడంపార్క్‌లో ధర్నా చేశారు. మహిళలు సమాజంలో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారని, దాడులు అధికమైనట్లు వాపోయారు. ప్రభుత్వం దుండగులకు ముకుతాడు వేయాలని నినాదాలు చేశారు.

 

#

Tags : 1

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)