Breaking News

ఈ యుద్ధం గెలవాలంటే మనం కలిసి పోరాడాలి

Published on Wed, 12/25/2024 - 08:26

చండీగఢ్‌: ‘ఈ యుద్ధంలో మనం విజయం సాధించాలంటే సమైక్యంగా ఉంటూ పోరాడాలి’అని రైతు నేత జగ్జీత్‌ సింగ్‌ డల్లెవాల్‌(70) ఉద్బోధించారు. పంజాబ్‌–హరియా ణా సరిహద్దుల్లోని ఖనౌరీ వద్ద ఆయన చేపట్టిన దీక్ష మంగళవారం 29వ రోజుకు చేరుకుంది. డల్లెవాల్‌ ఆరోగ్యం విషమంగా ఉన్న ట్లు ఆయన్ను పరీక్షించిన వైద్యులు హెచ్చరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఖనౌరీలో ని దీక్షా శిబిరం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ఆయన మాట్లాడారు. 

‘నిరశన దీక్షకు మద్దతుగా నిలిచిన వారందరికీహృదయ పూర్వక కృతజ్ఞతలు. నేను బాగానే ఉన్నానని, మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఈ యుద్ధంలో మనం గెలవాలి. దేశం యావత్తూ కలిసికట్టుగా పోరాడినప్పుడు మాత్రమే ఈ పోరాటంలో నెగ్గగలం. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం మనల్ని ఇక్కడి నుంచి తొలగించరాదని నేను కోరుతున్నా. ప్రభుత్వం మన పోరాటాన్ని కొనసాగనిస్తే మనం గెలుస్తాం లేదా ఇక్కడే చనిపోతాం. ఈ రెండింటిలో ఒకటి ఖాయం’అని ఆయన స్పష్టం చేశారు.

 డల్లెవాల్‌ చాలా బలహీన స్వరంతో నెమ్మదిగా రెండు నిమిషాలసేపు మాత్రం మాట్లాడగలిగారని ఆయనకు సహాయకుడిగా ఉంటున్న రైతు నేత అభిమన్యు కొహార్‌ చెప్పారు. తాను బాగానే ఉన్నానంటూ డల్లెవాల్‌ చెప్పడం అంటే..శారీరకంగా అత్యంత బలహీనంగా ఉన్నప్పటికీ, మానసికంగా ఇప్పటికీ దృఢంగా ఉన్నట్లు అర్థమని అనంతరం కొహార్‌ వివరించారు. కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కి చట్టబద్ధత కలి్పంచడం వంటి డిమాండ్లతో రైతు సంఘాలు ఆందోళనలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నిరసనలకు మద్దతుగానే డల్లెవాల్‌ నిరాహార దీక్ష చేపట్టారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)