Breaking News

భరతం పట్టిన బార్‌ కోడ్‌

Published on Mon, 12/22/2025 - 06:26

న్యూఢిల్లీ: ఢిల్లీలోని కరోల్‌ బాగ్‌ ప్రాంతంలో జరిగిన ఒక హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించిన తీరు ఒక క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తోంది. అది డిసెంబర్‌ 15వ తేదీ.. కరోల్‌ బాగ్‌లోని అజ్మల్‌ ఖాన్‌ పార్కులో ఒక వ్యక్తి తన స్నేహితుడితో కలిసి సరదాగా ఇన్‌స్టా రీల్స్‌ షూట్‌ చేసుకుంటున్నాడు. పక్కనే మద్యం తాగుతున్న ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వారితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు.

 గొడవకు కారణమేమిటంటే.. నిందితులు బాధితుడిని అగ్గిపెట్టె అడిగారు. లేదన్నందుకు అతని జేబులు వెతకడం మొదలుపెట్టారు. అది కాస్తా తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. ఆవేశంలో ఒక నిందితుడు బీర్‌ సీసాను పగులగొట్టి, బాధితుడి తలపై బలంగా బాదాడు. బాధితుడు రక్తపు మడుగులో పడిపోగా, నిందితులు అక్కడి నుండి పరారయ్యారు. 

క్లూ దొరికిందిలా.. 
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేయగా, దాడికి ఉపయోగించిన పగిలిన బీర్‌ సీసా దొరికింది. దానిపై ’బార్‌ కోడ్‌’ చెక్కు చెదరకుండా ఉంది. అదే ఈ కేసులో కీలక మలుపు.. ఆ బార్‌కోడ్‌ ఆధారంగా పోలీసులు సమీపంలోని వైన్‌ దుకాణాలన్నీ గాలించారు.

72 గంటల గాలింపు 
బార్‌కోడ్‌ మ్యాచ్‌ అయిన వైన్‌ దుకాణం దగ్గర సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించగా, నిందితులు వాడిన స్కూటర్‌ బయటపడింది. వరుస సీసీటీవీలను పరిశీలించిన స్పెషల్‌ టీమ్, కేవలం 72 గంటల్లోనే నిందితుల చిరునామా కనిపెట్టి వారిని చుట్టుముట్టింది.

అసలు నిందితులు వీరే!  
డిసెంబర్‌ 18న హమ్మద్‌ అలియాస్‌ రిజ్వాన్‌ (22), కామ్రాన్‌ (24), ఫర్జాన్‌ (24) అనే ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిలో హమ్మద్‌ అనే వ్యక్తి సాధారణ నేరస్తుడు కాదు.. అతనిపై ఇప్పటికే 20 ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయి. అగ్గిపెట్టె కోసం మొదలైన గొడవలో.. ఒక చిన్న బార్‌కోడ్‌ ఆధారం నిందితుల్ని కటకటాల వెనక్కి నెట్టింది.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)