బంగ్లాదేశ్‌ నుంచి తల్లీకూతుర్ల చొరబాటు.. బీఎస్‌ఎఫ్‌ కాల్పులు.. బాలిక మృతి

Published on Thu, 09/05/2024 - 11:42

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తరువాత అక్కడి హిందువులతో సహా ఇతర మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి. దీంతో అక్కడి మైనారిటీలు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా త్రిపురలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బంగ్లాదేశ్‌కు చెందిన 13 ఏళ్ల హిందూ బాలికతో పాటు ఆమె తల్లి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో వారిని అడ్డుకునేందుకు బీఎస్‌ఎఫ్‌ జవానులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ బాలిక మృతిచెందింది.

ఢాకా ట్రిబ్యూన్ తెలిపిన వివరాల ప్రకారం సంఘటన జరిగిన 45 గంటల తర్వాత బీఎస్‌ఎఫ్‌ ఆ బాలిక మృతదేహాన్ని బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ)కి అప్పగించింది. ఆమెను 13 ఏళ్ల స్వర్ణ దాస్‌గా గుర్తించారు. కాగా చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత మృతదేహాన్ని బాలిక కుటుంబానికి  అప్పగించామని కులౌరా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ బినయ్ భూషణ్ రాయ్ తెలిపారు.

త్రిపురలో ఉంటున్న తమ సోదరుడిని కలిసేందుకు స్వర్ణ, ఆమె తల్లి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వీరికి స్థానిక బ్రోకర్లు సహకారం అందించారు. వారు భారత సరిహద్దుకు చేరుకున్నప్పుడు వారిని వారిస్తూ బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో స్వర్ణ అక్కడికక్కడే మృతిచెందగా ఆమె తల్లి ప్రమదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఈ విషాద ఘటనపై సరిహద్దు ప్రాంతంలోని ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)