Breaking News

మేఘాలయలో బంగ్లా టాప్‌ లీడర్‌ మృతి.. కారణం అదేనా?

Published on Fri, 08/30/2024 - 07:10

షిల్లాంగ్‌: ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో బంగ్లాదేశ్‌ రాజకీయ నాయకుడి మృతదేహం లభించడం తీవ్ర కలకలం సృష్టించింది. భారత సరిహద్దు నుంచి 1.5 కి.మీ దూరంలో తమలపాకు తోటలో అవామీ లీగ్ నాయకుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం, అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.

వివరాల ప్రకారం.. భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దు నుండి 1.5 కి.మీ దూరంలో ఉన్న ఈస్ట్ జైన్తియా హిల్స్ జిల్లాలో బంగ్లాకు చెందిన అవామీ లీగ్ నాయకుడు ఇషాక్ అలీ ఖాన్ కన్నా మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్బంగా జైన్తియా ఎస్పీ గిరిప్రసాద్ మాట్లాడుతూ.. మృతుడి దగ్గర బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్ దొరికింది. అతడిని బంగ్లాదేశ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాకు చెందిన అవామీ లీగ్ నాయకుడు ఇషాక్ అలీ ఖాన్ పన్నాగా గుర్తించాము. పోస్టుమార్గం నిమిత్తం అతడిని ఖలీహ్రియత్‌లోని సివిల్ ఆసుపత్రి తరలించినట్టు తెలిపారు.

ఇక, పోస్టుమార్టం అనంతరం, తదుపరి ప్రక్రియల కోసం డెడ్ బాడీని ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచినట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా..  బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ ప్రభుత్వం పతనం తర్వాత పన్నా పరారీలో ఉన్నాడు. షేక్‌ హసీనా ప్రభుత్వంలో పన్నా కీలక వ్యక్తిగా ఉన్నట్టు సమాచారం. అయితే, భారత్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చి ఉంటుంది అధికారులు భావిస్తున్నారు. ఆయన మృతిపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)