Breaking News

కాషాయం కట్టొద్దు.. తులసి మాల దాచేయండి: ఇస్కాన్‌ సూచన

Published on Tue, 12/03/2024 - 09:59

కోల్‌కతా:‘కాషాయం ధరించడం మానుకోండి.. తిలకం పెట్టకండి.. తులసి జపమాల ఎవరికీ కనపడనీయకండి’.. ఇదీ కోల్‌కతాలోని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) బంగ్లాదేశ్‌లోని హిందువులకు, కృష్ణ భక్తులకు ఇచ్చిన సలహా. ఇలా చేసినప్పుడే మతఛాందసవాదుల నుంచి రక్షించుకోగలుగుతారని ఇస్కాన్‌ అక్కడి హిందువులకు సూచించింది.

ఇస్కాన్ కోల్‌కతా వైస్ ప్రెసిడెంట్ రాధారమణ్‌ దాస్.. బంగ్లాదేశ్‌లోని హిందువులు దేవాలయాలలో లేదా తమ ఇళ్లలో మాత్రమే తమ మతాచారాలను పాటించాలని, బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సంక్షోభ సమయంలో తమను తాము రక్షించుకునే దృష్టితో ఉండాలని ఆయన సలహా ఇచ్చారు. కాషాయ వస్త్రాలు ధరించవద్దని, నుదుటిపై తిలకం పెట్టుకోవద్దని రాధారమణ్‌ దాస్ సూచించారు. తులసిమాలను మెడలో ధరించాలనుకుంటే దానిని బయటకు కనిపించకుండా చూసుకోవాలని రాధారమణ్‌ దాస్‌ విజ్ఞప్తి చేసినట్లు ఓ ఆంగ్ల దినపత్రిక కథనం వెలువరించింది.

బంగ్లాదేశ్‌లోని హిందువులు బయటకు సాధువులుగా కనిపించకుండా తమను తాము చూసుకోవాలని రాధారమణ్‌ దాస్ కోరారు. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలు, ఇస్కాన్ సన్యాసులపై హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి. ఇటీవల బంగ్లాదేశ్‌లో ఒక చట్టపరమైన కేసులో ఆధ్యాత్మికవేత్త చిన్మయ్ కృష్ణ దాస్‌ను అరెస్టు చేశారు. న్యాయవాది రమణ్‌రాయ్‌పై దాడి జరిగింది. అతని పరిస్థితి విషమంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఆధ్యాత్మిక బోధకుడు చిన్మయ్‌ కృష్ణ దాస్‌ను అక్టోబర్ 25న అరెస్టు చేసినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్ జాతీయ జెండాపై కాషాయ జెండాను ఎగురవేసినందుకు ఆయనపై దేశద్రోహం కేసు నమోదైంది. దాస్ అరెస్టు  అనంతరం నవంబర్ 27న చిట్టగాంగ్ కోర్ట్ బిల్డింగ్ ప్రాంతంలో పోలీసులకు, ఆధ్యాత్మిక గురువు అనుచరులకు మధ్య జరిగిన ఘర్షణలో ఒక న్యాయవాది మృతిచెందాడు.

బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న హింసాయుత ఘటనలపై భారతదేశం ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పీ) ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా వీహెచ్‌పీ నేతలు బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దురాగతాలను అరికట్టేందుకు ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. బంగ్లాదేశ్‌లోని హిందువులకు భద్రత కల్పించాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన నిర్వహించారు.

ఇది కూడా చదవండి: Bangladesh: చిన్మయ్ కృష్ణ దాస్ తరపు న్యాయవాదిపై దాడి.. పరిస్థితి విషమం

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)