Breaking News

Bangladesh: నిరసనకారులకు సైన్యం మద్దతు.. చిక్కుల్లో ప్రధాని హసీనా?

Published on Mon, 08/05/2024 - 11:22

బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న రిజర్వేషన్ల నిరసనల మధ్య ఆ దేశ ప్రధాని షేక్ హసీనా చిక్కుల్లో పడబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. షేక్ హసీనా రాజీనామా చేయాలనే డిమాండ్ నుంచి నిరసనకారులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.

ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో బంగ్లాదేశ్ ఆర్మీ అధికారులు.. నిరసనకారులకు మద్దతు పలుకుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఆందోళనకారులకు, పాలక ప్రభుత్వానికి మధ్య జరిగిన ఘర్షణలో వంద మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో నిరసనకారులపై ఇకపై కాల్పులు జరపబోమని సైన్యం స్పష్టం చేసింది. మరోవైపు చర్చల కోసం ప్రధాని హసీనా చేసిన ప్రతిపాదనను విద్యార్థి నాయకులు తిరస్కరించారు.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ (సీఏఎస్‌) ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో అధికారులతో సమావేశమైన దరిమిలా ఇకపై నిరసనకారులపై ఒక్క బుల్లెట్ కూడా కాల్చబోమని ప్రకటించారు. అలాగే అధికార మార్పిడి అప్రజాస్వామికంగా జరిగితే బంగ్లాదేశ్ కూడా కెన్యాలా మారుతుందని వ్యాఖ్యానించారు. 1971 తర్వాత దేశంలో ఇదే అత్యంత హింసాత్మక నిరసన అని ఆయన పేర్కొన్నారు.

కాగా నిరసనకారులు దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించాలని బంగ్లాదేశ్‌కు చెందిన ప్రొఫెసర్ నజ్ముల్ అహ్సాన్ కలీముల్లా పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ రాజకీయ నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ ఉద్యమం తీవ్రతరమైతే, ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)