Breaking News

Air India Plane Crashed: మనవరాళ్లతో ఆడుకునేందుకు లండన్‌ బయలుదేరి..

Published on Sun, 06/15/2025 - 09:43

అహ్మదాబాద్‌: దేశంలో సంభవించిన అత్యంత ఘోర విమాన ప్రమాదాలలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ప్రమాదం ఒకటి. ఈ ప్రమాదం యావత్‌ ప్రపంచాన్ని కంటతడి పెట్టించింది. గుజరాత్‌లోని ఆనంద్‌కు చెందిన వ్యాపారవేత్త బద్రుద్దీన్ హలానీ కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. లండన్‌లోని తన ముద్దుల మనవరాళ్లలో ఆనందంగా ఆడుకోవాలనే ఆశతో బయలుదేరిన ఆయన అంతలోనే అనంతవాయువుల్లో కలిసిపోయారు.

బద్రుద్దీన్ హలానీ తన భార్య యాస్మిన్, వదిన మాలెక్‌తో కలిసి విమానంలో లండన్‌ బయలుదేరారు. అక్కడ తన మనవరాళ్లతో కలసి  ఆడుకుంటూ కాలం గడపాలని ఎన్నో కలలుగన్నారు.  అలాగే తన కలల ప్రాజెక్ట్ అయిన సిల్వాసాలోని ఆర్ఎస్ఎస్ఎస్ అనుబంధ సైనిక్ స్కూల్ కోసం నిధులు సేకరించేందుకు అమెరికా వెళ్లాలని కూడా బద్రుద్దీన్ హలానీ  ప్లాన్ చేసుకున్నారు. అతని సోదరుడు రాజుభాయ్ హలానీ మీడియాతో మాట్లాడుతూ.. తన అన్న సామాజిక సేవ చేయడంలో ముందుంటారని,  సిల్వాసాలోని సైనిక్ స్కూల్ నెలకొల్పాలని అనుకున్నారన్నారు. లండన్‌లో తన మనవరాళ్లతో ఆనందంగా కాలం గడపాలని అనుకున్నారని తెలిపారు.

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే బద్రుద్దీన్ కుమారుడు అసిమ్ హలానీ  లండన్‌ నుంచి అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. తన తండ్రి మృతదేహాన్ని గుర్తించేందుకు తన డీఎన్‌ఏ నమూనాను ఆసుపత్రి సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నా ఇద్దరు కుమార్తెలు.. తాతనాన్నమ్మ లండన్ వస్తున్నారని తెలిసి చాలా ఉత్సాహంగా ఉన్నారు. తాత కోసం గ్రీటింగ్ కార్డులు కూడా తయారు చేశారు. ఇప్పుడు ఆ కార్డులను ఎవరికి ఇస్తారు? మా కుటుంబానికి తట్టుకోలోని పరిస్థితి ఎదురయ్యింది. మా నాన్న నన్ను ఎప్పుడూ కొట్టలేదు. నేను ఏ బొమ్మ అడిగితే, అది కొనిచ్చారు. అదే ప్రేమ మనవరాళ్లకు కూడా ఇస్తారని అనుకున్నాను’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు.  

ఇది కూడా చదవండి: Air India Plane Crashed: ప్రమాదాన్ని తొలుత చూసింది ఇతనే.. వెంటనే ఏం చేశారంటే..

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)