Breaking News

ఎన్సీపీలో చేరిన బాబా సిద్దిఖీ కుమారుడు

Published on Fri, 10/25/2024 - 09:50

ముంబై: మహారాష్ట్ర మాజీ మంత్రి, దివంగత నేత బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిఖీ శుక్రవారం ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీలో చేరారు. అజిత్‌ పవార్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా జీషన్‌ మాట్లాడుతూ.. ఇది తనకు, తన కుటుంబానికి ఉద్వేగభరితమైన క్షణం అని పేర్కొన్నారు. ఈ కష్ట సమయాల్లో తనును నమ్మినందుకు అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరేలకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌ స్థానమైన వాంద్రే ఈస్ట్‌ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక్కడి నుంచే నామినేషన్‌ వేసి ప్రజలందరి ప్రేమ, మద్దతుతో మరోసారి గెలుస్తానని ధీమా  వ్యక్తం చేశారు.

కాగా 2019 ఎన్నికల్లో వాంద్రే ఈస్ట్‌ నుంచి గెలుపొందిన 32 ఏళ్ల జీషన్‌ సిద్దిఖీ.. గత ఆగస్టులో మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ఓటింగ్‌కు పాల్పడ్డారనే అభియోగాలతో కాంగ్రెస్‌ పార్టీ నుంచి బహిష్కరించింది. అయితే ఈ ఆరోపణలను ఆయన ఖండించారు.

అసెంబ్లీ ఎన్నికల వేళ మహరాష్ట్ర మహా వికాస్‌ అఘాడీ కూటమి 255 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వాంద్రే సిట్టింగ్‌ ఎమ్మెల్యే జీషన్‌ సిద్ధిఖీ స్థానాన్ని పొత్తులో భాగంగా కాంగ్రెస్‌.. శివసేన (యూబీటీ) ఉద్దవ్‌ ఠ్రాకేకు అప్పగించింది. శివసేన అధినేత ఉద్దవ్‌ ఠాక్రే మేనల్లుడు వరుణ్ సర్దేశాయ్‌ ఇక్కడి నుంచి పోటీ చేయనున్నారు. ఈ క్రమంలోనే అసమ్మతి వ్యక్తం చేస్తూ జీషన్‌.. ఎన్సీపీలో చేరారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)