Breaking News

బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్ట్‌ చేయాల్సిందే.. రెజ్లర్లకు బాబా రాందేవ్‌ సపోర్ట్‌

Published on Sat, 05/27/2023 - 13:04

ఢిల్లీ: జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌పై భారత్‌ స్టార్‌ రెజ్లర్ల తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాము చేసిన ఆరోపణలపై న్యాయం చేయాలని కోరుతూ స్టార్‌ రెజ్లర్లు కొద్దిరోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా, తాజాగా రెజ్లర్లకు యోగా గురువు బాబా రాందేవ్‌ తన మద్దతు ప్రకటించారు. 

రాజస్థాన్‌లోని భిల్వారాలో మూడు రోజుల పాటు జరుగుతున్న యోగా కార్యక్రమాలకు బాబా రాందేవ్‌ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ టాప్‌ రెజ్లర్లు జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనకు కూర్చున్నారు. ఇలాంటి పరిస్థితి రావడం చాలా సిగ్గు చేటు. అలాంటి వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టాలి. అతడు తల్లులు, బిడ్డలు, అక్క చెల్లెళ్ల గురించి ప్రతిరోజూ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు. అతడి తీరు ఖండించదగినది’ అని కామెంట్స్‌ చేశారు. 

అంతకుముందు కూడా రెజ్లర్ల ఆందోళనపై బాబా రాందేవ్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘రెజ్లర్లు ఒలింపిక్స్‌లో దేశానికి ఖ్యాతి తెచ్చినప్పుడు సంబురాలు చేసుకున్నాం. న్యాయం కోసం పోరాడుతున్న ఈ సమయంలో వారికి మనం అండగా నిలవాలి. రెజ్లింగ్‌ సమాఖ్య చీఫ్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలి’ అని ట్విట్టర్‌లో కామెంట్స్‌ చేశారు. ఇదే సమయంలో బ్రిజ్‌ భూషణ్‌ అరెస్ట్‌పై కూడా బాబా రాందేవ్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. బ్రిజ్‌ భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయినప్పటికీ అరెస్ట్‌ కాలేదన్నారు. ఈ విషయంలో తాను ప్రకటనలు మాత్రమే చేయగలనన్నారు. అతడిని జైలులో పెట్టే అధికారం తనకు లేదని వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చదవండి: ‘9 ఏళ్ల పాలన.. 9 ప్రశ్నలు.. మోదీపై విద్వేషంతోనే ఇదంతా..’

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)