Breaking News

బస్సులో అసభ్య ప్రవర్తన

Published on Fri, 07/25/2025 - 10:32

తమిళనాడు:  మద్యం మత్తులో ఓ యువతి ఎదుట నగ్నంగా నిలబడి అసభ్యకరంగా ప్రవర్తించిన ఆయుర్వేద వైద్యశాల డాక్టర్‌ను బస్సులోని ప్రయాణికులు చితకబాది పోలీసులకు అప్పగించిన ఘటన బుధవారం రాత్రి కలకలం రేపింది. తిరువళ్లూరు బస్టాండు నుంచి శ్రీపెరంబదూరుకు బుధవారం రాత్రి పది గంటలకు ప్రభుత్వ బస్సు సుమారు 25 మంది ప్రయాణికులతో బయలుదేరింది. 

బస్సు కామరాజర్‌ విగ్రహం వద్ద వచ్చిన క్రమంలో అప్పటికే మద్యం మత్తులో వున్న వ్యక్తి నగ్నంగా మారి యువతి ఎదుట అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో యువతి గట్టిగా కేకలు వేయడంతో బస్సులోని ప్రయాణికులు నగ్నంగా ఉన్న వ్యక్తిని చూసి షాక్‌కు గురి కావడంతో పాటూ అతడ్ని చితకబాది దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు చేపట్టిన విచారణలో మద్యం మత్తులో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి శ్రీపెరంబదూరుకు చెందిన మదియగళన్‌గా గుర్తించారు. ఇతను అరక్కోణంలోని ఆయుర్వేద వైద్యశాలలో డాక్టర్‌గా పని చేస్తున్నట్టు నిర్ధారించారు. కాగా బస్సులో నగ్నంగా మారి యువత ఎదుట అసభ్యకరంగా ప్రవర్తించిన ఆయుర్వేద వైద్యుడి వ్యవహార శైలి స్థానికంగా కలకలం రేపింది. కాగా నిందితుడిని పోలీసు స్టేషన్‌కు తరలించి పోలీసులు విచారణ చేస్తున్నారు.

Videos

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)