Breaking News

మరో ఉత్సవానికి అయోధ్య ముస్తాబు

Published on Tue, 04/08/2025 - 10:35

అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య(Ayodhya)లోగల రామాలయం మరో ఉత్సవానికి సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమం మే నెలలో జరగనున్నదని తెలుస్తోంది. 2024, జనవరి 22న జరిగిన బాలరాముని ప్రాణప్రతిష్ఠ తరువాత ఇప్పుడు మందిర నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. మే నెలలో ఆలయంలోని  మరికొన్ని విగ్రహాల ప్రతిష్ఠాపన జరగనుంది. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారులు త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. 

ప్రస్తుతం మందిర నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి . ఈ పనులు 2025 చివరి నాటికి పూర్తి కావచ్చని అంచనా.  మే నెలలో అయోధ్యలో జరిగే ప్రతిష్ఠాపన కార్యక్రమంతో దేశవ్యాప్తంగా అయోధ్యపైకి మరోమారు అందరి దృష్టి మరలనుంది. 2024, జనవరి 22న రామాలయంలోని గర్భగుడిలో బాలరాముణ్ణి ప్రతిష్ఠింపజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi), ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో పాటు దాదాపు 7,000 మంది ప్రముఖులు పాల్గొన్నారు.

రామ మందిరం మూడు అంతస్తులతో నిర్మితమవుతోంది. ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ పూర్తయింది. మిగిలిన అంతస్తులతో పాటు శిఖర నిర్మాణం కొనసాగుతోంది. ఇవి కొనసాగుతుండగానే మే నెలలో ఆలయ సముదాయంలోని ఇతర దేవతల విగ్రహాల ప్రతిష్ఠాపన జరగనుంది. దశావతారం, శేషావతారం, నిషాదరాజు, శబరి, అహల్య, తులసీదాస్ తదితర మహనీయులకు సంబంధించిన 18 నూతన మందిరాల నిర్మాణం కొనసాగుతున్నదని ట్రస్ట్ పేర్కొంది. మే నెలలో జరిగే కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు అయోధ్యకు తరలివస్తారని ట్రస్ట్‌ భావిస్తోంది.

రామాలయంలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించిన అనంతరం ఆలయానికి రోజుకు సగటున లక్షమంది వరకూ భక్తులు వస్తున్నారు. కాగా మే నెలలో జరిగే విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకావచ్చిన సమాచారం.  ఈ కార్యక్రమం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు, రవాణా సౌకర్యాలు, తాత్కాలిక టెంట్ సిటీలను సిద్ధం చేస్తోంది.

ఇది కూడా చదవండి: ‘అసమానతలను అర్థం చేసుకోండి’: బిల్‌గేట్స్‌ 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)