‘దీపోత్సవ్‌’కు అయోధ్య ముస్తాబు.. ఈసారి ప్రత్యేకతలివే..

Published on Sun, 10/19/2025 - 13:56

అయోధ్య: శ్రీ రాముని జన్మస్థలమైన అయోధ్య నేడు (ఆదివారం) జరిగే ‘దీపోత్సవ్‌’కు ముస్తాబయ్యింది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఈ వేడుక ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘దీపోత్సవం-2025’కు అందరినీ ఆహ్వానించింది.

2017లో ఆదిత్యనాథ్ నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అయోధ్యలో దీపోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ  ఏడాది తొమ్మిదవ దీపోత్సవానికి విస్తృత సన్నాహాలు చేశారు. ధరంపత్ నుండి లతా చౌక్, రామ్‌కథా పార్క్, సరయు ఘాట్ వరకు అంతటా వెలుగులు విరజిమ్మనున్నాయని ఒక అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో 33 వేల మంది వాలంటీర్లు పాల్గొననున్నారు. 26 లక్షల11 వేల 101 దీపాలను వెలిగించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించనున్నారు.

దీపోత్సవ్‌ నోడల్ అధికారి ప్రొఫెసర్ సంత్ శరణ్ మిశ్రా మాట్లాడుతూ ఇప్పటికే  రెండు  లక్షలకు పైగా దీపాలను వెలిగించారని తెలిపారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ బృందం ఘాట్ల వారీగా దీపాల సంఖ్యను లెక్కిస్తోందన్నారు. ఘాట్ నంబర్ 10 వద్ద, విశ్వవిద్యాలయ వాలంటీర్లు 80 వేల దీపాలతో స్వస్తిక్‌ చిహ్నాన్ని రూపొందించడానికి ఏర్పాట్లు చేశారు. కాగా ఐడి కార్డు లేకుండా ఘాట్లలోకి ప్రవేశించడాన్ని నిషేధించారు. ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాత్రి 8:30 గంటలకు రామ్ కీ పైడిలో లేజర్ షో, లైట్ అండ్ సౌండ్ షో, డ్రోన్ షో నిర్వహించనున్నారని మీడియాకు అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్ నిఖిల్ తెలిపారు.

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)