Breaking News

అయోధ్యకు లండన్‌ సాధ్విల బృందం!

Published on Mon, 01/22/2024 - 08:51

శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశంలోని నలుమూలల నుంచి రామభక్తులు అయోధ్య నగరానికి చేరుకుంటున్నారు. 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత జరుగుతున్న ఈ మహోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విదేశాల నుంచి కూడా రామభక్తులు తరలివస్తున్నారు. లండన్‌కు చెందిన మహిళల బృందం ఇప్పటికే  అయోధ్య చేరుకుంది. వారిలో కొందరు మనస్తత్వవేత్తలు, మరికొందరు జీవశాస్త్రవేత్తలు ఉన్నారు. వీరు సాధ్విలుగా మారారు. వీరంతా తమ ఉద్యోగాలను వీడి, సన్యాసం స్వీకరించారు. సాధ్వి అవధి మాట్లాడుతూ తాను తన చిన్నతనంలో అయోధ్యకు వచ్చానని, ఇప్పుడు రామ్‌లల్లా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చానని తెలిపారు. 

అయోధ్యకు తరలివచ్చిన సాధ్వి అవక్షి మాట్లాడుతూ ‘తామంతా సాధ్విలం, అశుతోష్మావారి  అనుచరులం. రామ్‌లల్లా పవిత్రోత్సవంలో పాల్గొనేందుకు వచ్చాం. ఇది సనాతనీయులకు అపూర్వమైన రోజు. దీని వెనుక ఎన్నో ఏళ్ల పోరాటం ఉంది. ఇప్పుడు ప్రపంచ వేదికపై హిందువులు బహిరంగంగా  ఉత్సవం జరుపుకునే అవకాశం వచ్చిందని’ అన్నారు.  

సాధ్వి గాబ్రియేల్ మాట్లాడుతూ ‘నాలోని భక్తే నన్ను రామ్‌లల్లాకు  దగ్గర చేసింది. అందరూ అయోధ్య రాముని గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ సానుకూల శక్తి అపారంగా ఉంది. కొన్ని యుగాలుగా మనకు మార్గదర్శకంగా నిలిచిన రామాయణం, హిందూ సంస్కృతి, వేదాలు, మంత్రాలు మనల్ని సన్మార్గంలో నడిపిస్తున్నాయి. సాధ్వి అవక్షి డబుల్ పీహెచ్‌డీ చేశారు. బ్రిటిష్ ప్రభుత్వ విభాగంలో ఫిజియాలజిస్ట్‌గా పనిచేశారు. ఆమె తన ఉద్యోగాన్ని వదులుకొని సాధ్వీగా మారారు. గాబ్రియెల్..  బ్రిటన్‌లో జీవశాస్త్రవేత్తగా పనిచేశారు. పదవీ విరమణ పొందాక, సాధ్విగా మారారు. 
ఇది కూడా చదవండి: మారిషస్‌ నుంచి డెన్మార్క్‌ ... అంతా రామమయం!

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు