Breaking News

అయోధ్యకు అందిన విరాళాల మొత్తం ఎంతంటే?

Published on Mon, 08/12/2024 - 07:13

అయోధ్యలో రామాలయ నిర్మాణపనులు 2025 డిసెంబర్ నాటికి పూర్తికానున్నాయి. ఇప్పటి వరకూ ఆలయ నిర్మాణ పనుల్లో మొదటిదశ పూర్తయ్యింది. 2024 జనవరి 22న బాల రాముడు ఆలయంలో ప్రతిష్ఠితుడయ్యాడు. రామాలయ నిర్మాణం ప్రారంభమైనది మొదలు భక్తులు ప్రతిరోజూ విరాళాలు  అందజేస్తున్నారు.

రామ్‌లల్లా ఆలయానికి భూమి పూజ 2020, ఆగస్టు 5న జరిగింది. అప్పటి నుండి రామభక్తులు ఆలయ నిర్మాణానికి రూ. 55 వేలకోట్లకు పైగా నిధులను విరాళాల రూపంలో అందజేశారు. 2021లో నిర్వహించిన ఫండ్ డెడికేషన్ క్యాంపెయిన్‌లో రామమందిర్ ట్రస్ట్ దాదాపు రూ. 3500 కోట్ల విరాళాలను అందుకుంది. గడచిన 10 నెలల్లో రామాలయ నిర్మాణానికి విదేశాల్లో ఉంటున్న రామ భక్తులు సుమారు 11 కోట్ల రూపాయల మేరకు విరాళాలు అందించారు.

రామమందిర్ ట్రస్ట్ 2021లో  42 రోజుల పాటు ఆలయ నిర్మాణం కోసం నిధుల సేకరణ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందుకోసం ట్రస్టు 10 వేల రసీదులను ముద్రించింది. ఈ సందర్భంగా దేశంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి 3,500 కోట్ల రూపాయలు విరాళాల రూపంలో అందాయి. 2024 జనవరి 22న  రామాలయంతో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగింది అప్పటి నుంచి రామ భక్తులు ప్రతిరోజూ భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటి వరకూ మూడు కోట్ల మందికి పైగా రామ భక్తులు ఆలయాన్ని సందర్శించారు. వీరు విరాళాలతో పాటు బంగారు, వెండి కానుకలను కూడా అందజేస్తున్నారు.

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి ప్రకాష్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం రామభక్తులు ఇప్పటి వరకు ఐదువేల కోట్ల రూపాయల మేరకు విరాళాలు అందించారు. విదేశాలలో ఉంటున్న రామభక్తులు కూడా ఉత్సాహంగా విరాళాలు  అందజేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో రామమందిర్ ట్రస్ట్ విదేశాల నుంచి వచ్చిన విరాళాల మొత్తాన్ని లెక్కించింది. ఇప్పటి వరకు విదేశాల నుంచి దాదాపు 11 కోట్ల రూపాయలు విరాళాలుగా అందాయి. 

Videos

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)