Breaking News

తొలిరోజు విరాళాలు రూ.3.17 కోట్లు!.. మూడో రోజు సజావుగా దర్శనాలు!

Published on Thu, 01/25/2024 - 07:19

అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమైన రెండవరోజున(బుధవారం) దాదాపు 2.5 లక్షల మంది భక్తులు దర్శనానికి తరలివచ్చారు. మంగళవారం(తొలిరోజు) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేపట్టిన ఆకస్మిక పర్యటన, సూచనల ప్రభావం బుధవారం కనిపించింది. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తాజాగా యాత్రికుల సౌకర్య కేంద్రాన్ని ప్రారంభించింది. ఇది భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతోంది.

బాలక్‌ రాముని దర్శనాలు ప్రారంభమై నేటికి (గురువారం) మూడో రోజు. మొదటి రెండు రోజులు భక్తుల రద్దీతో అనేక ఇబ్బుందులు తలెత్తాయి. ఈ నేపద్యంలో ట్రస్ట్‌ పలు చర్యలు చేపట్టడంతో ప్రస్తుతం ఆలయంలో భక్తుల దర్శనాలు క్రమపద్ధతిలో సాగుతున్నాయి. రామభక్తుల దర్శనాలు నిరంతరం కొనసాగుతున్నాయి. బాలరాములోరికి భక్తులు కానుకలు, విరాళాలు విరివిగా సమర్పిస్తున్నారు. 
ఇది కూడా చదవండి: కొనసాగుతున్న భక్తుల వరద

ప్రాణప్రతిష్ఠ జరిగినంతనే ఐదేళ్ల బాలరాముడు కోటీశ్వరునిగా మారిపోయాడు. తొలిరోజు శ్రీరాముని దర్శనానికి వచ్చిన భక్తులు రూ.3.17 కోట్ల విరాళాలను సమర్పించారని ట్రస్ట్‌ తెలిపింది. రామ్‌లల్లా ‍ప్రాణప్రతిష్ఠ అనంతరం మంగళవారం ఆలయంలోకి సామాన్య భక్తుల ప్రవేశానికి అనుమతి కల్పించారు. రామాలయానికి వచ్చిన సందర్శకుల సంఖ్యకు సంబంధించి గతంలో ఉన్న రికార్డులన్నీ బద్దలయ్యాయి. లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో దర్శనం కోసం వారు నానా అవస్థలు పడ్డారు. రాములోరి దర్శనం కోసం  వచ్చిన భక్తులు విరాళాలు సమర్పించారు. 

రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధి డాక్టర్ అనిల్ మిశ్రా మాట్లాడుతూ మంగళవారం ఆలయానికి అత్యధిక విరాళాలు అందాయి. ఆన్‌లైన్‌లో విరాళాలు అందించడానికి రామభక్తులు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. విరాళాల కోసం ఏర్పాటు చేసిన క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి, పలువురు భక్తులు విరాళాలు అందించారన్నారు. కాగా అయోధ్యకు తరలివచ్చే భక్తులు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా విరాళాలు అందించవచ్చు. ఆలయంలోని హుండీలలో కూడా విరాళాలు సమర్పించేందుకు అవకాశం కల్పించారు.

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)