Breaking News

అయోధ్య రాముని దర్శన వేళల్లో మార్పులు

Published on Mon, 03/03/2025 - 11:01

అయోధ్య: యూపీలోని రామజన్మభూమి అయోధ్య(Ram Janmabhoomi Ayodhya)లో బాలరాముణ్ణి దర్శించుకునే వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయని రామమందిర ట్రస్ట్‌ తెలిపింది. ఇటీవల ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరిగిన సమయంలో అక్కడి నుంచి వస్తున్న భక్తుల సౌకర్యార్థం అయోధ్య రామాలయాన్ని ప్రతీరోజూ 19 గంటల పాటు తెరిచివుంచారు. ఇప్పుడు ఈ దర్శన సమయాన్ని తగ్గించారు.

మహాకుంభమేళా(Mahakumbh Mela) జరిగిన సమయంలో ప్రతీరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ భక్తులకు రామ్‌లల్లా దర్శనం కల్పించారు. ఇప్పుడు ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళా ముగిసిన దరిమిలా అయోధ్యకు వచ్చే భక్తుల సంఖ్య కొంతమేరకు తగ్గింది. ఈ నేపధ్యంలో రామజన్మ భూమి తీర్థ ట్రస్ట్‌ గతంలో మాదిరిగానే దర్శనాల సమయాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో ఇకపై రామభక్తులకు అయోధ్యలో ప్రతీరోజూ 19 గంటలపాటు దర్శనం లభించదని ట్రస్ట్‌ తెలిపింది.

రామాలయ ట్రస్ట్‌(Ramalaya Trust) సభ్యుడు డాక్టర్‌ అనిల్‌ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ ఇకపై ప్రతీరోజూ మంగళ హారతి  ఉదయం 4 గంటలకు జరుగుతుందని, ఆ తర్వాత 4:15 నుండి 6 గంటల వరకు తలుపులు మూసివేస్తారన్నారు. తిరిగి ఉదయం  ఆరు గంటలకు మరో హారతి ఉంటుందని, అనంతరం భక్తులు 6:30 నుండి 11:50 వరకు  దర్శనాలు చేసుకోవచ్చన్నారు. తరువాత ఆలయ తలుపులను మధ్యాహ్నం 12 గంటల వరకు మూసివేస్తారన్నారు.  

మధ్యాహ్న రాజభోగం 12 గంటలకు ఉంటుందని, హారతి అనంతరం దర్శనం 12.30 వరకు ఉంటుందని, ఆ తరువాత ఆలయ తలుపులను ఒంటి గంట వరకు మూసివేస్తారన్నారు. అనంతరం సాయంత్రం 6:50 వరకు దర్శనాలు ఉంటాయన్నారు. తరువాత రాత్రి 7 గంటల వరకు తలుపులు మూసివేస్తారని, సాయంత్రం 7 గంటలకు హారతి అనంతరం రాత్రి 9:45 వరకు బాలరాముని దర్శనం ఉంటుందన్నారు. 9:45 నుండి 10 వరకు తలుపులు మూసివేస్తారని, ఆ సమయంలో బాలరామునికి విందు వడ్డిస్తారన్నారు. శయన హారతి అనంతరం రాత్రి 10:15కు ఆలయ తలుపులు మూసివేస్తారన్నారు. 

ఇది కూడా చదవండి: World Wild Life Day: వన్యప్రాణులతోనే మానవ మనుగడ

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)