Breaking News

అయోధ్య శ్రీరాముడికి ఖరీదైన నైవేద్యం

Published on Tue, 06/16/2026 - 12:34

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కొలువైన అందాల రాముడికి స్థానిక భక్తుడు (రైతు) ఒకరు సమర్పించిన కానుక విశేషంగా నిలుస్తోంది. తాను పండించిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండును నైవేద్యంగా అందించారు.  ఈ పండు విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో కిలోకు రూ. 2.5 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు ఉంటుంది. స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా, తులసి దళంతో కలిపి ఈ పండును సోమవారం దేవుడికి సమర్పించారు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండుగా పేరుగాంచిన జపాన్‌కు చెందిన 'మియాజాకి' (Miyazaki) రకాన్ని అయోధ్యలోని రామ్ మందిరంలో  రాముడికి  తొలి సారిగా సమర్పించారు. ఈ విశేషమైన మామిడి పండును "సూర్యుని గుడ్డు" (Egg of the Sun) అని కూడా పిలుస్తారు. ఈ రకం మామిడి ఒక్కో పండు ధర సుమారు రూ. లక్ష ఉంటుందని అంచనా. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి రకాల్లో ఒకటిగా నిలిచింది.

అయోధ్య వాతావరణ పరిస్థితులకు ఈ రకం మామిడి ఎంతవరకు అనుకూలంగా ఉంటుందో తెలుసుకునే ఉత్సాహంతో సుమారు రెండేళ్ల క్రితం రైతు ఓంప్రకాష్ సింగ్ దీనిని నాటారు. సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, ఆ చెట్టు స్థానిక వాతావరణానికి విజయవంతంగా అలవాటు పడి, ఈ సీజన్‌లో దాదాపు డజను పండ్లను కాసింది. మియాజాకి మామిడి దాని అద్భుతమైన తీపి, అధిక పీచు పదార్థం (ఫైబర్) , పోషక విలువలకి ప్రసిద్ధి చెందిందని సింగ్  వెల్లడించారు.

సింగ్‌  అందించిన వివరాల ప్రకారం ఒక్కో పండు బరువు 150 గ్రాముల నుండి 300 గ్రాముల మధ్య ఉంది. తోటలోని తొలి పండును దేవుడికి అంకితం చేసే సుదీర్ఘ సంప్రదాయం ప్రకారం శ్రీరాముడికి సమర్పించా మన్నారు. మియాజాకితో పాటు, థాయిలాండ్ వెరైటీ 'బనానా మ్యాంగో', ఆస్ట్రేలియా రకం  'R2E2' , భారతదేశానికి చెందిన 'చౌసా', 'దశేరి' వంటి వివిధ రకాలను కూడా  పండిస్తున్నారు.

మహంత్ సీతారాం దాస్ జీ మహరాజ్ హర్షం
ఓంప్రకాష్ సింగ్ తోటను సందర్శించిన మహంత్ సీతారాం దాస్ జీ మహరాజ్ ఈ సందర్భాన్ని కొనియాడారు. ఈ మామిడి పండు రంగు విశ్వాన్ని ప్రకాశింపజేసే సూర్య భగవానుడిని పోలి ఉందని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు అయోధ్య గడ్డపై పండటం, తొలి పంటను  శ్రీరాముడికి ప్రసాదంగా సమర్పించడం ఎంతో అదృష్టమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)