Breaking News

Ayodhya: అయోధ్యకు వెళ్లే బస్సులు రద్దు!

Published on Wed, 01/24/2024 - 11:42

ఢిల్లీ: అయోధ్య బాలక్‌ రామ్‌ మందిర్‌కు ఎగబడుతున్న భక్తులకు, సందర్శకులకు పెద్ద షాకే తగిలింది. అయోధ్య వైపు వెళ్లే బస్సులను రద్దు చేస్తున్నట్లు బుధవారం అక్కడి రవాణా శాఖ ప్రకటించింది. తిరిగి బస్సులు  ఎప్పుడు నడుస్తాయనేది ఇప్పట్లో చెప్పలేమని స్పష్టం చేసింది. 

అయోధ్య రామ మందిర  ప్రాణ ప్రతిష్ట తర్వాత ‘బాలక్‌ రామ్‌’ దర్శనం కోసం భక్తులు ఎగబడి పోతున్నారు. దేశవ్యాప్తంగా అయోధ్య వైపు అడుగులేస్తున్నారు. తొలిరోజే ఏకంగా ఐదు లక్షల మంది దర్శించుకునేందుకు వచ్చినట్లు ఓ అంచనా. అందులో 3 లక్షల మందిదాకా దర్శించుకోగా.. మరో రెండు లక్షల మంది బయట ఎదురుచూస్తూ ఉండిపోయారు.  ఈ క్రమంలో నిన్న అధికారులకు భక్తుల నియంత్రణ కష్టతరంగా మారింది. 

ఇదీ చదవండి: బాలక్‌ రామ్‌ కోసం.. ఈ నిరీక్షణ చూశారా?

దీంతో ఇవాళ కేంద్ర బలగాలను సైతం మోహరించారు. మొత్తం అయోధ్యలో 8 వేలమంది సిబ్బందిని భద్రత కోసమే మోహరించారు. అదే సమయంలో లక్నో, ఇతర ప్రాంతాల నుంచి అయోధ్యకు బస్సుల్లో భక్తులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో రద్దీని నిలువరించేందుకు బస్సు సర్వీసులన్నింటినీ రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి వస్తేనే తిరిగి సర్వీసులు నడుపుతామని ఓ అధికారి మీడియాకు వివరించారు. 

ఇక.. దైవదర్శనం కోసం తొందరపడొద్దని.. రెండు వారాల తర్వాత రద్దీ కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయని భక్తులకు, సందర్శకులకు అయోధ్య ఐజీ ప్రవీణ్‌ కుమార్‌ విజ్ఞప్తి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు నిదానంగా రావాలని కోరుతున్నారాయన.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)