Breaking News

అయోధ్యపై దాడికి ప్లాన్.. యూపీ జైలులో దారుణ హత్య!

Published on Mon, 02/09/2026 - 13:28

అయోధ్య రామమందిరంపై  బాంబు దాడి యత్నం కేసులో అరెస్టైన అబ్దుల్ రహమాన్ అనే వ్యక్తి జైలులో హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. నిన్న ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో  అతనిపై అరుణ్ చౌదరి అనే వ్యక్తి దాడి చేసినట్లు పేర్కొన్నారు.

నిన్న రాత్రి పదునైన ఆయుధంతో  రహ్మన్ తలపై దాడి చేయగా అతనికి తీవ్రగాయాలైనట్లు అధికారులు తెలిపారు. దీంతో అతనిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారని పేర్కొన్నారు. కాగా అతనిపై దాడి చేసిన అరుణ్ చౌదరి జమ్మూకశ్మీర్ కు చెందిన వ్యక్తి అని తెలిపారు. ప్రస్తుతం రహ్మన్ ఫరిదాబాద్ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.  

2025లో గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, హర్యాణా స్పెషల్ టాస్క్ ఫోర్స్  దాడులు  చేసి రహ్మాన్ ని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో అతని చేతిలో రెండు  బాంబులను స్వాధీనం చేసుకున్నారు. అయితే అనంతరం జరిపిన విచారణలో రహ్మాన్ నకిలీ ధృవపత్రాలతో ఫరీదాబాద్ లో నివసిస్తున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు.

అనంతరం అతని వద్ద స్వాధీనం చేసుకున్న వీడియోలలో రామమందిరానికి సంబంధించిన కీలక చిత్రాలు వీడియోలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే అతనికి ఐఎస్ఐతో సంబంధం ఉన్న సంస్థల ద్వారానే బాంబులు అందినట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అతని హత్య చేయడానికి గల  కారణాలు తెలియదని.. ఎందుకోసం  అతనిపై దాడి చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)