Breaking News

అయోధ్య విమానాశ్రయం విశేషాలివే

Published on Sun, 12/31/2023 - 10:15

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ఎయిర్‌పోర్టు అనేక విశేషాలను కలిగివుంది. అయోధ్య నగర చరిత్ర, విశిష్టత, ఆధ్యాత్మిక వాతావరణం ప్రతిబింబించేలా ఈ విమానాశ్రయ రూపుదిద్దుకుంది. 

విమానాశ్రయం టెర్మినల్‌ భవనాన్ని శ్రీరామ మందిరాన్ని తలపించేలా తీర్చిదిద్దారు. ప్రధాన ద్వారంపై ఆలయ తోరణాల డిజైన్‌ రూపొందించారు. శ్రీరాముని జీవితాన్ని కళ్లకు కట్టే కళాఖండాలు, చిత్రాలు, కుడ్యచిత్రాలతో విమానాశ్రయం శోభాయమానంగా కనిపిస్తోంది. 

విమానాశ్రయం సమీపంలో బస్సు పార్కింగ్‌తోపాటు దివ్యాంగులకు అనుకూలమైన వసతి సౌకర్యాలు కల్పించారు. ఎల్‌ఈడీ లైటింగ్, వాననీటి నిర్వహణ, సౌర విద్యుత్‌ ప్లాంట్, మురుగు శుద్ధి ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. ప్రాంగణం చుట్టూ పరుచుకున్న పచ్చదనం నిర్వహణకు వాడిన నీటిని రీ సైకిల్‌ చేసి ఉపయోగించనున్నారు.

మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణం కేవలం 20 నెలల్లో పూర్తయిందని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ సంజీవ్‌ కుమార్‌ చెప్పారు. ఈ ఎయిర్‌పోర్టు గతంలో కేవలం 178
ఎకరాల్లో ఉండేది. దీనిని ఇప్పుడు రూ.350 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దారు. యూపీ ప్రభుత్వం 821 ఎకరాల భూమిని విమానాశ్రయం కోసం కేటాయించింది.

‍ప్రతి ఏటా 10 వేల మంది ప్రయాణికుల రాకపోకలు సాగించేందుకు వీలుగా విమానాశ్రయాన్ని అత్యంత విశాలంగా నిర్మించారు. టెర్మినల్‌ భవనాన్ని 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. 2.2 కిలోమీటర్ల పొడవైన రన్‌వేను ఏర్పాటు చేశారు. దీంతో ఎయిర్‌బస్‌–321 రకం విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌ సులభతరం కానుంది.

ఇక్కడ  రెండు లింక్‌ ‘టాక్సీ వే’లు ఉండటంతో ఒకేసారి ఎనిమిది విమానాలను పార్క్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది. త్వరలో విమానాశ్రయ రెండో దశ విస్తరణ పనులు మొదలుకానున్నాయి. టెర్మినల్‌ను 50 వేల చదరపు మీటర్లకు విస్తరించనున్నారు. ఏటా ఏకంగా 60 లక్షల మంది రాకపోకలకు వీలుగా విస్తరణ ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధంచేశారు. రన్‌వేను 3.7 కిలోమీటర్లకు విస్తరించి, అదనంగా 18 విమానాల పార్కింగ్‌కు చోటు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. 
ఇది కూడా చదవండి: భారత్‌లో ఐదు కొత్త సంవత్సరాలు... ఏడాది పొడవునా సంబరాలే!

Videos

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు