Breaking News

సెన్సార్ల లోపం వల్లే ఎక్కువ ఉష్ణోగ్రతలు

Published on Sun, 06/02/2024 - 06:29

న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మే 30వ తేదీన నమోదైన 56, వాయవ్య ఢిల్లీలోని ముంగేష్ పుర్‌లో మే 29వ తేదీన నమోదైన 52.9 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు తప్పు అని భారత వాతావరణ శాఖ శనివారం స్పష్టంచేసింది. మే 29న ముంగేష్ పుర్‌లో వాస్తవ గరిష్ట ఉష్ణోగ్రత 45.2 ఉంటే సెన్సార్‌ దానిని 52.9 డిగ్రీల సెల్సియస్‌గా చూపించింది. ముంగేష్ పుర్, నాగ్‌పూర్‌ స్టేషన్లలో ఉష్ణోగ్రతను లెక్కగట్టే సెన్సార్‌లలో లోపాలు తలెత్తడం వల్లే అసాధారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వివరణ ఇచి్చంది.

 ‘‘ ఈ రెండు ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్‌(ఏడబ్ల్యూఎస్‌)లో బిగించిన సెన్సార్‌లను త్వరలోనే పరిశీలిస్తాం. ఢిల్లీలోని ఇతర ఆటోమేటిక్, మాన్యువల్‌ అబ్జర్వేటరీల్లో నమోదైన ఉష్ణోగ్రతలతో పోలిస్తే ముంగేష్ పుర్‌ ఏడబ్ల్యూఎస్‌లో అసాధారణ ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడికి ఇప్పటికే నిపుణుల బృందాన్ని పంపించాం. ముంగేష్‌పుర్‌లో స్టాండర్డ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ నమోదుచేసిన దానికంటే ఈ సెన్సార్‌ మూడు డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను ఎక్కువ చూపించింది. లోపాలున్న సెన్సార్‌ను త్వరలోనే మార్చేస్తాం’’ అని భారత వాతావరణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర చెప్పారు.  

Videos

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు