Breaking News

కిరాయికి వెళ్లకుండానే నెలకు రూ. 8 లక్షలు సంపాదిస్తున్న ఆటోవాలా 

Published on Sat, 06/07/2025 - 06:08

ముంబై: ముంబైలోని అమెరికా కాన్సులేట్‌ వెలుపల ఉంటూ నెలకు లక్షల్లో సంపాదిస్తున్న ఓ ఆటోవాలా ఉదంతం పతాక శీర్షికల్లో నిలిచింది. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం కాకుండా వీసా దరఖాస్తుదారుల బ్యాగ్‌లను భద్రంగా ఉంచడమన్న చిన్న వ్యాపార చిట్కాయే ఇతడి విజయ రహస్యం. ఇతడు ఇంజనీరింగ్‌లాంటివేమీ చదవలేదు. స్టార్టప్‌ ఫండింగ్‌ అసలే లేదు. ఎటువంటి వ్యాపార ప్రణాళికా లేదు.. అయినప్పటికీ తన రోజువారీ శ్రమను నెలకు రూ.5 లక్షల నుంచి 8 లక్షల వరకు సంపాదించే వ్యాపారంగా మార్చాడు. 

లెన్స్‌కార్ట్‌ కంపెనీలో పనిచేసే రాహుల్‌ రుపానీ ఇటీవల వీసా అపాయింట్‌మెంట్‌ కోసం అమెరికా కాన్సులేట్‌ వద్దకు వెళ్లిన సమయంలో ఈ ఆటో డ్రైవర్‌ తారసపడ్డాడు. రుపానీయే ఇతడి వివరాలను లింక్డి్డన్‌లో షేర్‌ చేశారు. ‘ఇటీవల వీసా అపాయింట్‌మెంట్‌ కోసం అమెరికా కాన్సులేట్‌కు వెళ్లా. నా దగ్గర బ్యాగ్‌ ఉండటంతో అక్కడి సెక్యూరిటీ సిబ్బంది నన్ను లోపలికి వెళ్లనివ్వలేదు. బ్యాగును తాత్కాలికంగా భద్రపరిచేందుకు అక్కడ లాకర్లు కూడా లేవు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ రోడ్డు పక్కనే నిలబడి ఉన్నా. అంతలోనే అక్కడికి ఆ ఆటో డ్రైవర్‌ వచ్చాడు. 

బ్యాగును జాగ్రత్తగా తన దగ్గర ఉంచుకుంటానని, రూ.వెయ్యి ఖర్చవుతుందని చెప్పాడు. మొదట నేను వెనుకాడా. చివరికి అతడికి బ్యాగ్‌ ఇచ్చేసి ఆఫీసులోకి వెళ్లి పనిచూసుకుని వచ్చేశా. అప్పుడతడిని అడిగితే తన వినూత్న వ్యాపారంగా గురించి చెప్పాడు’అని రుపానీ వివరించారు. వీసాలకోసం వచ్చే వారిలో నిత్యం కనీసం 20 నుంచి 30 మంది అతడి వద్ద తమ బ్యాగులను ఉంచి వెళ్తుంటారు. వీరి నుంచి రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తూ నెలకు కనీసంగా రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు సంపాదిస్తున్నాడని రుపానీ తెలిపారు. 

అయితే, ఆటోలో 30 వరకు బ్యాగులను ఉంచుకోవడం చట్టబద్ధ వ్యవహారం కాదని తెలుసుకున్న ఆ ఆటోవాలా మరో ఉపాయం కనిపెట్టాడు. కాన్సులేట్‌కు సమీపంలోనే వస్తువులను భద్రపరిచే లాకర్‌ సౌకర్యం ఉన్న ఓ పోలీసు అధికారిని భాగస్వామిగా చేసుకున్నాడు. అతడి లాకర్‌లోనే సేకరించిన బ్యాగులన్నిటినీ చట్టబద్ధంగా, మరింత భద్రంగా ఉంచుతున్నాడని రుపానీ వివరించారు. అతడి ఆటో ఇప్పుడు కేవలం బ్యాగుల రవాణా కోసం పనిచేస్తోంది. చాలా మంది అమెరికా వీసా ఇంటర్వ్యూల కోసం శ్రమకోర్చుతుండగా ఆటోవాలా మాత్రం..ఎటువంటి కష్టం లేకుండా ఎంతో లాభదాయకమైన వ్యాపారం నడుపుతున్నాడని రుపానీ లింక్డి్డన్‌ పోస్టులో ప్రశంసలు కురిపించారు.   
 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)