Breaking News

మరాఠీ మాట్లాడని ఆటో డ్రైవర్‌పై దాడి

Published on Sun, 07/13/2025 - 13:27

ముంబై: మహారాష్ట్రలో బాషా వివాదాలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. తాజాగా విరార్ ప్రాంతంలో ఇటువంటి ఘటనే జరిగింది. శివసేనలోని ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన కార్యకర్తలు మరాఠీలో మాట్లాడేందుకు  నిరాకరించిన ఆటో డ్రైవర్‌పై దాడి చేశారు. ఆ డ్రైవర్ గతంలో ఒక వీడియోలో తాను హిందీ, భోజ్‌పురిలో మాట్లాడటం కొనసాగిస్తానని ప్రకటించాడు. ఇది కొన్నివర్గాలకు ఆగ్రహాన్ని తెప్పించింది.

శనివారం సాయంత్రం విరార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన కార్యకర్తలు ఆ డ్రైవర్‌ను వెతికి పట్టుకుని, అతనిపై దాడి చేశారు. తరువాత  మరాఠీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. శివసేన (యూబీటీ) విరార్ నగర చీఫ్ ఉదయ్ జాదవ్ ఈ చర్యను సమర్థించారు. ‘ఎవరైనా మరాఠీ భాషను, మహారాష్ట్రను, మరాఠీ ప్రజలను అవమానించే ప్రయత్నం చేస్తే, వారికి  శివసేన తనదైన శైలిలో సమాధానం  ఇస్తుందని జాదవ్ హెచ్చరించారు.
 

కాగా పలువురు ఈ దాడిని ఖండించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరైనదికాదన్నారు. కాగా ఈ ఘటనపై పోలీసులు ఎటువంటి అధికారిక ఫిర్యాదును నమోదు చేయలేదు. మహారాష్ట్రలో భాషా రాజకీయాలపై తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్‌) ఇటువంటి వివాదాల్లో చిక్కుకున్న దరిమిలా.. ఇప్పుడు ఉద్ధవ్ థాక్రే వర్గం కూడా ఇలాంటి దూకుడు చర్యలకు పాల్పడుతోందనే మాట వినిపిస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)