Breaking News

ప్రయాణికులకు విజ్ఞప్తి.. ఆ రైల్వే స్టేషన్‌ పేరు మారింది

Published on Sun, 10/26/2025 - 12:07

ఔరంగాబాద్: భారతీయ రైల్వే మరో రైల్వే స్టేషన్‌ పేరును మార్చింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును  ఛత్రపతి శంభాజీనగర్‌ స్టేషన్‌గా మారుస్తూ సెంట్రల్ రైల్వే నిర్ణయం తీసుకుంది. ఔరంగాబాద్ నగరం పేరును మార్చిన మూడేళ్ల తరువాత సెంట్రల్ రైల్వే.. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్‌ పేరును అధికారికంగా ‘ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్’గా మార్చింది. ఈ కొత్త స్టేషన్‌కు కోడ్‌ ‘సీపీఎస్‌ఎన్‌’ అని సెంట్రల్ రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఈ ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వేలోని నాందేడ్ డివిజన్ కిందకు వస్తుంది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం  ఇటీవల ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును మార్చడానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్  విడుదల చేసింది. 2023లో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని నాటి ప్రభుత్వం ఔరంగాబాద్ నగరం పేరును అధికారికంగా ఛత్రపతి శంభాజీనగర్‌గా మార్చింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడైన ఛత్రపతి శంభాజీ మహారాజ్‌కు నివాళిగా నగరం పేరును మార్చారు.

రైల్వే అధికారులు ప్రభుత్వ తాజా ఉత్తర్వులను అనుసరించి, స్టేషన్ పేరును మార్చడంతో పాటు ఆన్‌లైన్‌లో కూడా ఈ పేరు మార్పు ప్రక్రియను పూర్తిచేశారు. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్‌ను 1900లో హైదరాబాద్  ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనా కాలంలో నిర్మించారు. ఛత్రపతి శంభాజీనగర్ పర్యాటక కేంద్రంగా పేరొందుతోంది. ఈ ప్రాంతంలోనే అజంతా గుహలు, ఎల్లోరా గుహలతో పాటు పలు చారిత్రక కట్టడాలున్నాయి.

ఇది కూడా చదవండి: Mann Ki Baat: స్వదేశీ వస్తువులనే కొనండి: ప్రధాని మోదీ
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)