Breaking News

‘డబ్బు కోసమే వేధించి ఉంటే.. అలా ఎందుకు చేస్తా!’

Published on Mon, 12/16/2024 - 17:07

అతుల్‌ సుభాష్‌ మృతిలో తనకుగానీ, తన కుటుంబ సభ్యులకుగానీ ఎలాంటి ప్రమేయం లేదని భార్య నిఖితా సింఘానియా చెబుతోంది. ప్రస్తుతం బెంగళూర్‌ పోలీసుల అదుపులో ఉన్న నిఖిత.. విచారణలో పదే పదే ఈ విషయాన్ని చెబుతున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులో టెక్కీగా పని చేసిన అతుల్‌ సుభాష్‌.. తన భార్య, ఆమె కుటుంబం డబ్బు కోసం వేధించడం వల్లే చనిపోతున్నానంటూ.. ఓ సుదీర్ఘమైన డెత్‌నోట్‌ రాసి బలవనర్మణానికి పాల్పడ్డాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే..

బెంగళూరు: అతుల్‌ ఆత్మహత్యపై దుమారం రేగాక.. ఇటు నిఖిత, అటు ఆమె తల్లి, సోదరుడు పరారీలో ఉన్నారు. ఎవరికీ దొరక్కుండా వాట్సాప్‌ కాల్స్‌తో మాట్లాడుకుంటూ వచ్చారు. చివరకు.. నిఖిత ఓ బంధువుకు రెగ్యులర్‌ కాల్‌ చేయడంతో ఆమె ఆచూకీని కనిపెట్టగలిగారు. ఓ కాల్‌ ఆధారంగా తొలుత నిఖితను, ఆపై నిఖిత ద్వారా ఆమె తల్లి, సోదరుడ్ని పోలీసులు టట్రేస్‌ చేయగలిగారు. ముగ్గురినీ అరెస్ట్ చేసి బెంగళూరు తరలించిన.. కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కి పంపించారు. అయితే..

తన భర్త నుంచి తాను దూరంగా ఉండబట్టి మూడేళ్లు అవుతోందని.. అలాంటప్పడు తాను అతన్ని ఎలా వేధించగలనని ఆమె వాదిస్తోంది. ‘‘డబ్బు కోసమే అతన్ని వేధించి ఉంటే.. అతనికి దూరంగా నేను ఎందుకు ఉంటా?. అతని వెంటే ఉండి వేధించే దాన్ని కదా!’’ అని ఆమె పోలీసులతో చెబుతున్నట్లు తెలుస్తోంది. పైగా అతుల్‌ తనను అదనపు కట్నం కోసం వేధించాడని.. అందుకే 2022లో తాను కేసు పెట్టిన విషయాన్ని ఆమె పదే పదే ప్రస్తావిస్తోంది.

2022లో ఏం జరిగిందంటే..
2019లో అతుల్‌తో మా వివాహం జరిగింది. అయితే రెండేళ్లు గడిచాక అదనపు కట్నం కోసం అతుల్‌, అతని కుటుంబ సభ్యులు తనను శారీరకంగా హింసిస్తున్నారని నిఖితా సింఘానియా యూపీ జౌన్‌పూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు అసహజ శృంగారం కోసం అతుల్‌ తనను వేధించేవాడని ఆమె కేసు పెట్టింది. ఇక.. కట్నం కోసం తనను హింసించడాన్ని తట్టుకోలేకే తన తండ్రి గుండె జబ్బుతో మరణించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే..

నిఖిత అభియోగాల్ని అతుల్‌ తన డెత్‌నోట్‌లో ఖండించాడు. తనపై ఆమె పెట్టినవన్నీ తప్పుడు కేసులేనని.. ఆమె తండ్రికి గుండె జబ్బు దీర్ఘకాలికంగానే ఉందని.. కేవలం డబ్బు కోసమే తనను బ్లాక్‌మెయిల్‌ చేసేవారని పేర్కొన్నాడతను.

ఇంతకీ అతుల్‌ కొడుకు ఎక్కడ?
అతుల్‌ సుభాష్‌ కేసులో ఇప్పుడు ఒక్కటే ప్రశ్న వినిపిస్తోంది. అతుల్‌ నాలుగేళ్ల చిన్నారి ఎక్కడా? అని. ఇదే విషయాన్ని వ్యక్తం చేస్తూ.. అతుల్‌ తండ్రి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. తన మనవడ్ని తనకు అప్పగించాలని.. తన కొడుకు చివరి కోరిక తీర్చాలంటూ ఆ పెద్దాయన కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే.. అతుల్‌ మరణం వార్త తెలియగానే ఓ దగ్గరి బంధువు ఇంట్లో ఆ చిన్నారిని నిఖిత తల్లి వదిలేసినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు చిన్నారిని బెంగళూరుకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు.

పరారీలో మేనమామ!
అతుల్‌ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. బెంగళూరు మరథహల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. చాకచక్యంగా.. నిఖిత(29), నిషా(54), సోదరుడు అనురాగ్‌(27) అరెస్ట్‌ చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా బెంగళూరుకు తీసుకురాగలిగారు. న్యాయమూర్తి 14 రోజుల జ్యూడీషియల్‌ కస్టడీ విధించడంతో.. పరప్పణ అగ్రహార జైలుకు తరలించారు. అయితే నిఖిత మేనమామ పరారీలో ఉండడంతో.. అతని కోసం గాలింపు చేపట్టారు. #Justiceisdue

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)