Breaking News

కాక్రోచ్‌ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కేపై దాడి

Published on Mon, 06/15/2026 - 17:23

జైపూర్‌ : కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కేపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అభిజిత్‌ను చెంపదెబ్బకొట్టారు. అపై తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అభిజిత్‌పై దాడి చేసిన వారిని పట్టుకుని.. కాక్రోచ్‌ కార్యకర్తలు చితక బాదారు. 

సీజేపీ ఆధ్వర్యంలో ఈ రోజు (సోమవారం) జైపూర్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కేపై దాడి జరగడంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 

నీట్‌ పరీక్ష పత్రికా లీకేజ్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజు జైపూర్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి పార్టీ వ్యవస్థాపకులు అభిజిత్‌ దీప్కే హాజరయ్యారు. దీంతో పార్టీ మద్దతుదారులు ఆయనను భూజాలపై ఎత్తుకొని ర్యాలీగా సభాస్థలి వద్దకు తీసుకెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఊహించని పరిణామం జరిగింది.  

కాగా నీట్, సీబీఎస్‌ఈ పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ‘కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ)’ దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో జైపూర్‌లో నిర్వహించిన నిరసనల్లో ఆయనపై దాడి జరిగింది.

కాక్రోచ్ పార్టీ ఆవిర్భావం 

ఓ కేసులో భాగంగా దేశంలోని నిరుద్యోగ యువతను బొద్దింకలు, పరాన్నజీవులతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పోల్చిన విషయం తెలిసిందే. దాంతో కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. సీజేపీ ప్రారంభమైన గంటల వ్యవధిలోనే కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చారు. ఇక నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే నాయకత్వంలో మొదటిసారి దిల్లీలో భారీ ఎత్తున నిరసనలు జరిగాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు చేపడుతుంది. 

 

#

Tags : 1

Videos

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)