Breaking News

క్షీణించిన మంత్రి ఆతిషి ఆరోగ్యం.. ఆస్పత్రికి తరలింపు

Published on Tue, 06/25/2024 - 07:00

దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభాన్ని నివారించాలని కోరుతూ నిరాహార దీక్షకు దిగిన ఆప్‌ మంత్రి ఆతిషి ఆరోగ్యం సోమవారం అర్దరాత్రి క్షీణించింది. దీంతో ఆప్‌ నేత సంజయ్ సింగ్, ఇతర నేతలు, కార్యకర్తలు  ఆమెను లోక్ నాయక్ జైప్రకాష్ నారాయణ్ హాస్పిటల్ (ఎల్‌ఎన్‌జేపీ)కి తరలించారు.

ఈ సందర్భంగా ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ ఆతిషి రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ పడిపోయి 36కు చేరాయని అన్నారు. ప్రస్తుతం ఆమె వైద్యులు పర్యవేక్షణలో ఉన్నారన్నారు. ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ ఆతిషి ఆరోగ్యం క్షీణించిందని, వెంటనే ఆస్పత్రికి తరలించకపోతే ఆమె పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని వైద్యులు తెలియజేయంతో, తాము ఆమెను ఆస్పత్రిలో చేర్చామని అన్నారు. ఆతిషి  ఢిల్లీ ప్రజల కోసం పోరాడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

ఢిల్లీ ప్రజలకు హర్యానా నుంచి నీరు అందేలా చూడాలని జూన్ 21 నుంచి జలమండలి మంత్రి ఆతిషి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. జూన్ 21న ఉపవాస దీక్షకు ముందు ఆమె బరువు 65.8 కిలోలు. నిరాహార దీక్ష నాలుగో రోజుకు ఆమె బరువు 63.6 కిలోలకు తగ్గింది. నాలుగు రోజుల్లో రక్తంలో చక్కెర స్థాయి 28 యూనిట్లు తగ్గింది. రక్తపోటు స్థాయి కూడా తగ్గింది. ఇది ప్రమాదకరమని వైద్యులు చెప్పడంతో ఆమెను పార్టీ నేతలు ఆస్పత్రికి తరలించారు.
 

Videos

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు