Breaking News

Himachal: ఎడతెగని హిమపాతం.. స్కూళ్లు, కాలేజీలు మూసివేత

Published on Thu, 02/27/2025 - 12:17

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh)ను హిమపాతం ఇంకా వీడటం లేదు. లాహౌల్ స్పితి జిల్లాలో ఎడతెగని రీతిలో భారీగా మంచు కురుస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో గత రెండు రోజుల నుంచి అడపాదడపా  ఇదే పరిస్థితి ఏర్పడుతోంది. భారీగా మంచు పడుతున్న నేపధ్యంలో లాహౌల్ స్పితి జిల్లాలోని పాఠశాలలు, విద్యాసంస్థలను మూసివేయాలని రాష్ట్ర విద్యాశాఖ అదేశాలు జారీ చేసింది.

గడచిన మూడు రోజులుగా లాహౌల్ స్పితి(Lahaul Spiti)లో హిమపాతం కురుస్తోంది. నేడు (గురువారం) సిమ్లాలో తేలికపాటి వర్షం కుర్తుస్తోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మనాలి సమీపంలోని ధుండిలో కొండచరియలు విరిగిపడిన కారణంగా, లేహ్ మనాలి హైవేను మూసివేశారు. దీంతో మనాలిలోని సోలాంగ్ వ్యాలీని దాటి ముందుకు వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. అటల్ టన్నెల్ దక్షిణ, ఉత్తర పోర్టల్‌లలో రెండు అడుగుల ఎత్తున మంచు పేరుకుపోయింది.
 

ఇటువంటి పరిస్థితిలో స్థానికులు తమ ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావద్దని అధికారులు సూచించారు. ధర్మశాలలో భారీ వర్షం కారణంగా పోలీసు నియామక ప్రక్రియను మార్చి 9కి వాయిదా వేశారు. వాతావరణ శాఖ(Meteorological Department) తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రోహ్తాంగ్ పాస్ వద్ద దాదాపు రెండున్నర అడుగుల మేరకు మంచు కురిసింది. ఈ కారణంగా ఫిబ్రవరి 19 నుండి లాహౌల్ స్పితికి హెచ్‌ఆర్‌టీసీ బస్సు సర్వీసులను నిరవధికంగా నిలిపివేశారు. ఫిబ్రవరి 26- 28 మధ్య భారీ వర్షాలు/హిమపాతం సంభవించే అవకాశం ఉన్నందున హిమాచల్ ప్రదేశ్‌లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

ఇది కూడా చదవండి: Marathi Language Day: దేశంలో ‘థర్డ్‌ లాంగ్వేజ్‌’

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)