Breaking News

Delhi: అసెంబ్లీలో హంగామా.. 11 మంది ఆప్‌ ఎమ్మెల్యేలు సస్పెండ్

Published on Tue, 02/25/2025 - 12:21

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం(BJP government) అధికార పగ్గాలు చేపట్టాక తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈరోజు(మంగళవారం)అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు. కాగ్ నివేదికను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. సమావేశం ప్రారంభంకాగానే ఆప్‌  ఎమ్మెల్యేల నినాదాలతో గందరగోళం నెలకొన్న దరిమిలా ప్రతిపక్ష నేత అతిషితో సహా 11 మంది ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా సస్పెండ్ చేశారు. అనంతరం ఆప్ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ వెలుపల నిరసనకు దిగారు.

ఢిల్లీ అసెంబ్లీ బయట అతిషితో పాలు ఆప్‌ ఎమ్మెల్యేలు భగత్ సింగ్(Bhagat Singh) తదితరులు భీమ్‌రావ్ అంబేద్కర్ ఫోటోలను పట్టుకుని నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోని భగత్ సింగ్, అంబేద్కర్ ఫోటోలను ఎందుకు తొలగించారని అతిషి ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీ నుంచి ఈ రోజంతా సస్పెండ్ అయిన ఆప్‌ ఎమ్మెల్యేలలో ఒకరైన సంజీవ్ ఝా మీడియాతో మాట్లాడుతూ ‘నిన్న సీఎం కార్యాలయంలో డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ ఫొటో స్థానంలో ప్రధాని మోదీ  ఫొటో పెట్టారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కంటే ప్రధాని మోదీ గొప్పవారా? అని తామంతా స్పీకర్‌ను  అడగడంతో ఆయన  తమను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు. వారు (బీజేపీ) డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌(BR Ambedkar)ను ద్వేషించడాన్నిదేశం దీనిని అంగీకరించదు’ అని అన్నారు. ఈరోజు సభ ప్రారంభం కాగానే ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు పలు నినాదాలు చేసిన దరమిలా అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా వారిని శాంతంగా ఉండాలని కోరారు. అయితే ఆ ఎమ్మెల్యేలు నినాదాలు ఆపకపోవడంతో విజయేందర్ గుప్తా  ఆప్‌ నేత అతిషితో సహా 11 మంది ఆప్ ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు.

ఇది కూడా చదవండి: ‘ఆ గోధుమలతోనే జుట్టూడింది’

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)