Breaking News

Assembly Elections 2023: మూడు రాష్ట్రాల్లో సీఎంల ఎంపికపై బీజేపీ కసరత్తు!

Published on Tue, 12/05/2023 - 05:33

న్యూఢిల్లీ:  రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ మూడు రాష్ట్రాల్లో నూతన ముఖ్యమంత్రుల ఎంపికపై దృష్టి పెట్టింది. పార్టీ సీనియర్‌ నేతలు సోమవారం సమాలోచనల్లో మునిగిపోయారు.  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చర్చలు జరిపారు. ముఖ్యమంత్రుల ఎంపికపై అభిప్రాయాలు పంచుకున్నారు. మూడు రాష్ట్రాల్లో పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత బీజేపీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది.

ఇందుకోసం అతిత్వరలో మూడు రాష్ట్రాలకు పరిశీలకులను నియమించాలని బీజేపీ పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. కొత్త సీఎంలు ద ఇప్పటివరకైతే అధికారికంగా ఎవరూ నోరువిప్పలేదు. బీజేపీ అధిష్టానం గుంభనంగా వ్యవహరిస్తోంది. మూడు రాష్ట్రాల్లోనూ ఆశావహులు చాలామందే ఉన్నారు. సీఎం పదవే లక్ష్యంగా పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయతి్నస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో మరోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలని శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ భావిస్తున్నారు.

ఇక్కడ కేంద్ర మంత్రులు ప్రహ్లాద్‌ పటేల్, జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్రసింగ్‌ తోమర్‌తోపాటు సీనియర్‌ నేత విజయ్‌వర్గియా కూడా రేసులో ఉన్నారు. రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో సీనియర్లను పక్కనపెట్టి అనూహ్యంగా కొత్త ముఖాలను తెరపైకి తీసుకొచ్చే అవకాశాలు లేకపోలేదని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాజస్తాన్‌లో మాజీ సీఎం వసుంధర రాజే, ఛత్తీస్‌గఢ్‌లో మాజీ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ తమ ప్రయత్నాలు ఆపడం లేదు. రాజస్తాన్‌లో మహంత్‌ బాలక్‌నాథ్‌ యోగి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో అరుణ్‌ కుమార్‌ సావో, ధర్మలాల్‌ కౌషిక్, మాజీ ఏఐఎస్‌ అధికారి ఓ.పి.చౌదరి సీఎం పోస్టు కోసం పోటీపడుతున్నారు. వీరంతా ఓబీసీ వర్గానికి చెందిన నాయకులే.

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)