Breaking News

‘18 ఏళ్ల వారికి ఆధార్‌ ఆపేస్తున్నాం’

Published on Fri, 08/22/2025 - 07:04

గువాహటి: అసోంలోని 18 ఏళ్లు పైబడిన వారికి మొట్టమొదటి ఆధార్‌ కార్డుల జారీని అక్టోబర్‌ నుంచి నిలిపివేస్తున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. రాష్ట్రంలో ఉంటున్న అక్రమ వలసదారులు భారత పౌరసత్వం పొందకుండా అడ్డుకునేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన గురువారం ప్రకటించారు.

అయితే, ఇప్పటి వరకు ఆధార్‌ పొందని 18 ఏళ్లు పైబడిన వారికి నెల గడువు ఇస్తున్నామని, ఈలోగా వారు దరఖాస్తు చేసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ఎస్‌సీ, ఎస్‌టీలకు మాత్రం మరో ఏడాది వరకు ఆధార్‌ జారీ చేస్తారని వివరించారు. గత ఏడాది కాలంగా బంగ్లాదేశ్‌ నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి గుర్తించి, వెనక్కి పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకు మతం వంటి ప్రాతిపదికలేవీ లేవని స్పష్టం చేశారు. ఇక, ఆధార్‌ నమోదుకు ఎటువంటి వయో పరిమితి లేదని, అప్పుడే పుట్టిన శిశువుకు సైతం ఆధార్‌ నమోదు చేయించవచ్చని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) స్పష్టం చేసింది.   
 

Videos

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)