Breaking News

‘సీఏఏ’పై నిరసనలు.. అస్సాం పోలీసుల సీరియస్‌ వార్నింగ్‌

Published on Tue, 03/12/2024 - 09:21

గువహతి: కేంద్ర ప్రభుత్వం సోమవారం(మార్చ్‌11) నుంచి అమల్లోకి తీసుకువచ్చిన సీఏఏ చట్టంపై బంద్‌కు పిలుపిచ్చిన అస్సాం ప్రతిపక్ష పార్టీలకు ఆ రాష్ట్ర పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీఏఏ చట్టం రూల్స్‌ నోటిఫై చేసిన వెంటనే సోమవారం సాయంత్రం నుంచే అస్సాంలో ప్రతిపక్షపార్టీలు ఆందోళనలకు దిగాయి. రాజధాని గువహతితో పాటు చాలా ప్రాంతాల్లో సీఏఏ చట్టం కాపీలను నిరసనకారులు కాల్చివేశారు. చట్టం అమలు చేయడానికి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు.

దీంతో పోలీసులు ఈ ఆందోళలపై ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం జరిగే సర్బత్‌మక్‌ బంద్‌లో భాగంగా ఎవరైనా ప్రజల ఆస్తులకు నష్టం కలిగించడం, పౌరులను గాయపరచడం లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, జరిగిన నష్టాన్ని వారి నుంచే పూర్తిగా వసూలు చేస్తామని స్పష్టం చేశారు. ఈమేరకు ఎక్స్‌(ట్విటర్‌)లో పోలీసులు ఒక పోస్ట్‌ చేశారు. ఆదివారమే ఈ విషయమై సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రతిపక్ష పార్టీలకు తీవ్ర హెచ్చరిక చేశారు.

సీఏఏ చట్టం అమలుపై ఆందోళనలు చేసే రాజకీయ పార్టీల గుర్తింపు రద్దయ్యే చాన్స్‌ ఉందని సీఎం బిశ్వశర్మ హెచ్చరించారు. ఎవరికైనా చట్టం పట్ల అభ్యంతరాలుంటే దానిపై సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని సూచించారు. కాగా, 2019 డిసెంబర్‌లో సీఏఏపై అస్సాంలో హింసాత్మక ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనల్లో ఐదుగురు పౌరులు చనిపోయారు. ఈ చట్టం అమలు చేస్తే బంగ్లాదేశ్‌ నుంచి రాష్ట్రంలోకి భారీగా వలసలు ఉంటాయని పలు పార్టీలు, గ్రూపులు భావిస్తున్నాయి. ఇదే పెద్ద ఎత్తున నిరసనలకు కారణమవుతోందన్న వాదన వినిపిస్తోంది.

ఇదీ చదవండి.. ఆ స్టేట్స్‌లో సీఏఏ చట్టం ఉండదు 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)