Breaking News

అసోం అత్యాచారం కేసు: నిందితుడు మృతి

Published on Sat, 08/24/2024 - 11:11

దిస్‌పూర్‌: అసోంలోని నాగావ్‌ జిల్లాలో 14 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి  పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా ఈ ఘటనలో అరెస్టైన  ప్రధాన నిందితుడు శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పోలీసులు వివరాల ప్రకారం.. ఈ కేసులో శుక్రవారం పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్‌ చేశారు. దర్యాప్తులో భాగంగా ఈ రోజు తెల్లవారుజామున 3.30 గంటలకు క్రైం సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ కోసం ఘటన స్థలానికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో నిందితుడు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకొని ఓ చెరువులో దూకాడు. దీంతో వెంటనే పోలీసులు రెండు గంటల పాటు చెరువులో గాలించి మృతదేహాన్ని బయటకు తీసి స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ స్వప్ననీల్ వెల్లడించారు.

నాగావ్‌ జిల్లాలోని ధింగ్‌ ప్రాంతంలో గురువారం రాత్రి 8 గంటల సమయంలో బాలిక ట్యూషన్‌ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, ముగ్గురు వ్యక్తులు మోటార్‌ సైకిల్‌ వచ్చి, ఆమెను బంధించి అత్యాచారానికి పాల్పడి, రోడ్డు పక్కన విసిరేసి వెళ్లిపోయినట్లు పోలీసులు చెప్పారు.  బాధితురాలు పదో తరగతి చదువుతోందని, దుండగుల దుశ్చర్య వల్ల గాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకుందని తెలిపారు. స్థానికులు గమనించి, తమకు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. బాధితురాలిని అసుపత్రికి తరలించామని, చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇక..  ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. మహిళలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)