టీచర్లకు డ్రస్‌ కోడ్‌! కొత్త రూల్‌ని జారీ చేసిన ప్రభుత్వం

Published on Sat, 05/20/2023 - 20:00

ఉపాధ్యాయులకు డ్రెస్‌ కోడ్‌ జారీ చేస్తూ ప్రభుత్వం సంచన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. ఈ ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. ఈ మేరకు అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు జీన్స్‌, టీ షర్ట్‌లు, లెగ్గింగ్స్‌ ధరించకుండా నిషేధించేలా ఒక కొత్త నిబంధనను జారీ చేస్తు నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. వృత్తి రీత్యా ఉపాధ్యాయులైతే బోధన, క్రమశిక్షణ పరంగా వస్త్రధారణ ఆదర్శంగా ఉండాలని చెప్పింది.

ఉపాధ్యాయులు విధులను నిర్వర్తించే సమయంలో మర్యాదపూర్వక హోదాలో ఉంటారు కాబట్టి డ్రెస్‌ కోడ్‌ని అనుసరించాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొంది. అస్సాంలోని అని విద్యాశాఖల్లోని పురుష, మహిళా ఉపాధ్యాయులు లెగ్గింగ్‌లు, జీన్స్‌లు, టీ షర్ట్‌లు ధరించొద్దని కోరింది. కొందరూ ఉద్యోగులు తమకు నచ్చిన దుస్తులను ధరించి పాఠశాలలకు వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, పబ్లిక్‌ కూడా చాలా వరకు దీన్ని ఆమెదించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది.

బోధనా సమయంలో ఉపాధ్యాయులు తమ వృత్తికి తగ్గట్టుగా గంభీరత ప్రతిబింబించే దుస్తులు ధరించే కోడ్‌ అవసరమని నోటిఫికేషన్‌లో వెల్లడించింది. పాఠశాల విద్యాశాఖ పేర్కొన్న నిబంధనను అందరూ కచ్చితంగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణా చర్యలకు తీసుకోవడం జరుగుతుందని అస్సాం ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు అస్సాం విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ రనోజ్‌ పెగు మాట్లాడుతూ..అస్సాం ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పాఠశాల నియమ నిబంధనలకు సంబంధించిన పుస్తకాన్ని ప్రవేశపెట్టనుంది. అందులో పాఠశాలను ఎలా నిర్వహించాలి, తరగతులు ఏవిధంగా నిర్వహించాలి వంటి వాటి తోపాటు ఉపాధ్యాయుల డ్రస్‌ కోడ్‌, పిల్లల యూనిఫాంకి సంబంధించిన రూల్స్‌ ఉంటాయని చెప్పారు.

(చదవండి: పిల్లలకు స్మార్ట్‌ ఫోన్‌లు ఇవ్వకండి! కోరుతున్న సాక్షాత్తు కంపెనీ సీఈ ..)

Videos

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)