Breaking News

ఆగని అఘాయిత్యాలు.. ట్యూషన్‌ నుంచి వస్తుండగా బాలికను అడ్డగించి

Published on Fri, 08/23/2024 - 14:22

పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు రోజురోజుకీ ఉధృతమవుతున్నాయి. ఈ ఉదంతంపై ఆగ్రహాజ్వాలలు రగులుతున్న నేపథ్యంలో దేశంలో ఎక్కడో ఒక్క చోట చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు వెలుగుచూస్తుండటం ఆందోళన రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో లైంగిక వేధింపుల ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిని మరువకముందే తాజాగా అస్సాంలో మరో విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

అస్సాంలో 14ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. నాగావ్‌ జిల్లాలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాలిక ట్యూషన్‌ అనంతరం సైకిల్‌పై ఇంటికి బయల్దేరింది. దారిలో ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డగించి సమీపంలోని చెరువు వద్దకు లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను రోడ్డు వద్ద వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. రోడ్డుపై వివస్త్రగా పడి ఉన్న బాలికను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సగం అపస్మారక స్థితిలో ఉన్న బాలికను రక్షించి జిల్లాలోని డింగ్‌ మెడికల్‌ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ముగ్గురు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు మైనర్‌ పోలీసులకు తెలపడంతో కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనకు నిరసనగా నేడు విద్యార్ధి సంఘాలు స్థానిక ప్రాంతంలో బంద్‌కు పిలుపునిచ్చాయి. నిందితులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని  డిమాండ్‌ చేస్తున్నారు.

Videos

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. మైనింగ్ లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

రెండో టీ20లో వైభవ్ కు చాన్స్.. ఇషాన్ కిషన్ అవుట్

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

Photos

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం