Breaking News

అసోంలో వరదలు.. 60 మంది మృతి

Published on Tue, 07/02/2024 - 06:58

దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. వరదల బారిన పడిన అసోం, అరుణాచల్‌ రాష్ట్రాల ప్రజలు సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. వరదల కారణంగా అసోంలో సుమారు మూడు లక్షలమంది నిరాశ్రయులుగా మారగా, 60 మంది మృత్యువాత పడ్డారు.  

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో నీటిమట్టం పెరిగింది. ఫలితంగా నగాంవ్‌, డిబ్రుగఢ్‌ తదితర జిల్లాలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో పలువురు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. భారీ వర్షాలకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి.

మరోవైపు ఉత్తరాఖండ్‌లోని అలకనందా నదిలో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో సమీపప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా దేశంలోని పలు ప్రాంతాల్లో జూలైలో సాధారణం కన్నా అధికవర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. జూన్‌లో సాధారణంకన్నా 11 శాతం తక్కువ వర్షపాతం నమోదయ్యిందని పేర్కొంది.

#

Tags : 1

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)