Breaking News

రాహుల్‌ గాంధీపై అస్సాం సీఎం సంచలన ట్వీట్‌

Published on Fri, 02/23/2024 - 15:43

న్యూఢిల్లీ: వీలు దొరికినపుడల్లా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై విరుచుకుపడే అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తాజాగా మరోసారి ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీని హిమంత ఈసారి ఏకంగా ఉత్తర కొరియా నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌తో పోల్చారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్‌(ట్విటర్‌)లో ఆయన ఒక పోస్ట్‌ చేశారు.

ముంబై యూత్‌ కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌ బాబా సిద్ధికీ రాహుల్‌ గాంధీ టీమ్‌పై చేసిన బాడీ షేమింగ్‌ ఆరోపణలపై హిమంత స్పందించారు. నార్త్‌ కొరియా నియంత కిమ్‌ ఒక్కడే తనతో ఫొటో దిగే పార్టీ కార్యకర్తలు ఫొటోజెనిక్‌గా ఉండాలని కోరుకుంటారని హిమంత రాహుల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాహుల్‌ గాంధీని కలవాలని వెళ్లిన తనను 10 కేజీల వెయిట్‌ తగ్గి రావాల్సిందిగా రాహుల్‌ టీమ్‌ సభ్యులు సూచించారని బాబా సిద్ధిఖీ చేసిన ఆరోపణలు సంచనం రేపాయి. 

కాగా, గత నెలలో అస్సాంలో రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో  యాత్ర నిర్వహించిన సమయంలో హిమంత ప్రభుత్వం రాష్ట్రంలో యాత్రకు  చాలా షరతులు విధించింది. గువహతిలోకి యాత్ర ప్రవేశించేందుకు వీలు లేకుండా ఆదేశాలు ఇచ్చింది. దీంతో కాంగ్రెస్‌ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలకు సంబంధించి రాహుల్‌గాంధీపై   అస్సాం సీఐడీ కేసు కూడా పెట్టింది. త్వరలో ఈ కేసులో సీఐడీ రాహుల్‌కు సమన్లు ఇచ్చి విచారణకు పిలవనున్నట్లు తెలుస్తోంది. 

ఇదీ చదవండి.. రాహుల్‌ను కలవాలంటే 10 కేజీలు తగ్గమన్నారు 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)