Breaking News

Odisha: మంత్రిపై ఏఎస్‌ఐ కాల్పులు.. ఛాతీలో దిగిన బుల్లెట్లు..

Published on Sun, 01/29/2023 - 13:59

భువనేశ్వర్: ఒడిశా ఆరోగ్య మంత్రి నబ కిశోర్ దాస్‌పై ఏఎస్‌ఐ కాల్పులు జరిపాడు. ఝార్‌సుగుద జిల్లా బ్రజ్‍రాజ్‌నగర్‌లోని గాంధీ స్క్వేర్‌లో  ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఓ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రి కారులో నుంచి దిగగానే పోలీసు తుపాకీ తీసి నాలుగైదు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో కిశోర్ దాస్ ఛాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. అధికారులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

మంత్రిపై కాల్పులు జరిపిన ఏఎస్‌ఐ పేరు గోపాల్ దాస్ అని ఉన్నతాధికారులు వెల్లడించారు. అతను యూనిఫాంలోనే ఉన్నాడని పేర్కొన్నారు. తన సొంత తుపాకీతోనే కాల్పులు జరిపినట్లు చెప్పారు.
అయితే మంత్రిపై ఏఎస్‌ఐ ఎందుకు కాల్పులు జరిపాడనే విషయంపై మాత్రం స్పష్టత లేదు.  మంత్రికి పోలీస్ ఎస్కార్ట్ ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడం చూస్తుంటే భద్రతా వైఫల్యంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
చదవండి: కళల అభ్యున్నతికి పాల్పడుతున్న వారిని గుర్తించాం.. 'మన్‌కీ బాత్‌'లో మోదీ

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు