Breaking News

మరోసారి పాక్‌ ఆర్మీ చీఫ్‌ నవ్వులపాలు.. పరువు తీసేసిన ఒవైసీ

Published on Tue, 05/27/2025 - 11:59

కువైట్‌: దాయాది దేశం పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిం మున్సీర్‌పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సెటైర్లు వేశారు. కాపీ కొట్టడానికి అర్హత లేని స్టుపిడ్‌ జోకర్స్‌ అన్న ఒవైసీ.. పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఫేక్‌ మెమెంటో అంశాన్ని ప్రస్తావించారు. అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ కుటిల నీతిని ఎండగట్టేందుకు భారత ఎంపీల బృందాలు విదేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కువైట్‌లో పర్యటిస్తున్న ఎంపీల బృందంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఉన్నారు. ఈ క్రమంలో కువైట్‌లో ఆయ న మాట్లాడుతూ.. పాక్‌ ఫేక్‌ ప్రచారాన్ని ఎండగట్టారు. పాక్‌ చెప్పేవనీ అబద్ధాలే.. వారి ఫేక్‌ ప్రచారాలు నమ్మొద్దని ఒవైసీ అన్నారు.

పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌ అసత్య ప్రచార డోసు మరీ శ్రుతిమించి నవ్వులపాలవుతోంది. ఇటీవల ఉద్రిక్తతల సమయంలో భారత్‌పైకి తాము జరిపిన భీకర దాడులకు సాక్ష్యమంటూ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌కు బహుమతిగా అందజేసిన ఫొటోను చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఆపరేషన్‌ ‘బున్యన్‌ అల్‌–మర్సుస్‌’తో భారత్‌పై సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఇటీవల ప్రభుత్వ పెద్దలు, ఆర్మీ అధికారులతో ఫీల్డ్‌ మార్షల్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ హై ప్రొఫైల్‌ సమావేశం ఏర్పాటు చేశారు.

పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ పై ఓవైసీ సెటైర్లు

రాజకీయ నాయకత్వం గొప్పదనం, సైనిక బలగాల చెక్కు చెదరని నిబద్ధతను చాటేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రంలో ఆర్మీ చీఫ్‌ మునీర్‌ ప్రధాని షెహబాజ్‌కు ‘భారత్‌పై దాడులకు ప్రతీక’అంటూ ఒక భారీ చిత్రపటాన్ని కానుకగా అందజేశారు. ఈ ఫొటోనే మునీర్‌ దుష్ప్రచారాన్ని మరోసారి బట్టబయలు చేసింది. వాస్తవానికి ఈ ఫొటో 2019లో చైనా ఫొటోగ్రాఫర్‌ హువాంగ్‌ హై తీశారు. అది చైనా రూపకల్పన చేసిన పీహెచ్‌ఎల్‌–03 రకం బహుళ రాకెట్‌ లాంఛర్ల వ్యవస్థకు సంబంధించిన పాత ఫొటో.  

 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)