Breaking News

ఆర్యన్‌ఖాన్‌ను వదిలేసేందుకు రూ.25 కోట్లు!

Published on Sat, 05/13/2023 - 06:01

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ బాద్‌షా షారూక్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ను మాదకద్రవ్యాల కేసులో ఇరికించకుండా ఉండడానికి రూ.25 కోట్లు డిమాండ్‌ చేశారన్న ఆరోపణలపై ఎన్‌సీబీ మాజీ అధికారి సమీర్‌ వాంఖేడెపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. శుక్రవారం ముంబై, ఢిల్లీ, రాంచీ, కాన్పూర్‌లలో మొత్తం 29 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.

2021, అక్టోబర్‌ 2న ఒక క్రూయిజ్‌ షిప్‌లో డ్రగ్స్‌ని  సేవించాడన్న ఆరోపణలపై ఆర్యన్‌ఖాన్‌ను ఎన్‌సీబీ అరెస్ట్‌ చేయడం, ఆ తర్వాత క్లీన్‌ చిట్‌ ఇవ్వడం తెలిసిందే. వాంఖెడే దర్యాప్తు చేసిన ఈ కేసులో తప్పులుతడకలు ఉన్నాయని సిట్‌ దర్యాప్తులో ఇప్పటికే తేలింది. ఆర్యన్‌ను కేసు నుంచి వదిలేయడానికి రూ.25 కోట్లు డిమాండ్‌ చేశారన్న ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టింది. వాంఖేడె అడ్వాన్స్‌ కింద రూ.50 లక్షలు తీసుకున్నారని తమకు సమాచారం ఉందని సీబీఐ అధికారులు తెలిపారు. 

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)