Breaking News

‘మద్యం పాలసీ కేసు అప్పీలును మరో బెంచ్‌కు బదిలీ చేయాలి‘

Published on Wed, 03/11/2026 - 22:00

ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించిన అప్పీలును జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ బెంచ్‌ నుంచి మరో బెంచ్‌కు బదిలీ చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్‌ ఉపాధ్యాయకు మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ లేఖ రాశారు. ఈ కేసు జస్టిస్‌ శర్మనే కొనసాగిస్తే నిష్పాక్షిక విచారణ జరగకపోవచ్చని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఫిబ్రవరి 27న ట్రయల్‌ కోర్టు మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌తో పాటు మరో 22 మందికి విముక్తి కల్పించిన విషయం తెలిసిందే. వారిపై ఆరోపణలు నిరూపితం కాలేదని తేల్చింది. ఆ ఉత్తర్వును సీబీఐ సవాలు చేసింది. ప్రస్తుతం ఆ విషయంపైనే జస్టిస్‌ శర్మ విచారణ జరుపుతున్నారు.

మార్చి 9న జస్టిస్‌ శర్మ ఓ నోటీసు జారీ చేశారు. కేసు దర్యాప్తు చేసిన సీబీఐ అధికారిపై శాఖాపర చర్యలు చేపట్టాలని ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేశారు.ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులో చేసిన కొన్ని వ్యాఖ్యలు తప్పుగా ఉన్నట్లు ప్రాథమికంగా కనిపిస్తున్నాయని కూడా ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

అదే సమయంలో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఉన్న పీఎంఎల్‌ఏ కేసు విచారణను వాయిదా వేయాలని కూడా ట్రయల్‌ కోర్టుకు ఆమె ఆదేశించారు.  

రివిజన్‌ పిటిషన్‌లో సాధారణంగా స్పందన దాఖలు చేయడానికి కనీసం 4 నుంచి 5 వారాలు సమయం ఇస్తారని కేజ్రీవాల్‌ తెలిపారు. ఇంతకు ముందు కూడా అదే న్యాయమూర్తి ఎక్సైజ్‌ పాలసీ అంశాలపై విచారణ చేసి అదే అంశాలపై ప్రాథమిక అభిప్రాయాలు వ్యక్తం చేశారని కేజ్రీవాల్‌ తెలిపారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)