Breaking News

మహిళలకు బస్సు ఆపని డ్రైవర్‌.. సీఎం కేజ్రీవాల్‌ వార్నింగ్‌

Published on Sat, 05/20/2023 - 11:38

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరికలు జారీ చేశారు. బస్టాప్‌లో మహిళల కోసం బస్సు ఆపని డ్రైవర్లపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. కాగా  2019లో ఆప్ ప్రభుత్వం దేశ రాజధానిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఎంత మంది మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారనే నివేదికను బడ్జెట్ సమావేశాల్లో కూడా చూపిస్తున్నారు.

అయితే గత కొన్నిరోజులుగా మహిళలు ఉన్నచోట కొంతమంది డ్రైవర్లు బస్సు ఆపకుండానే వెళ్లిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై చాలామంది మహిళలు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ క్రమంలో తాజాగా ఓ డ్రైవర్‌ బస్టాప్‌లో మహిళలు ఉన్నచోట బస్సు ఆపకుండా వెళ్లిపోయాడు. ఇందులో ఓ బస్టాపులో  ప్రయాణికుడు దిగేందుకు బస్సును స్లో చేసిన డ్రైవర్.. అక్కడనున్న మహిళలను ఎక్కించుకోకుండా ముందుకు కదిలించాడు. వారు బస్సు వెనక పరిగెడుతున్నా పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

తాజా ఘటనకు సంబంధించి  కేజ్రీవాల్‌ తీవ్రంగా స్పందించారు. సదరు వీడియో పోస్టు చేస్తూ.. మహిళలు ఉన్నచోట బస్సులు ఆపాల్సిందేనని, లేకుంటే సదరు డ్రైవర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘మహిళలకు ప్రయాణం ఉచితం కాబట్టి కొంతమంది డ్రైవర్లు మహిళలను చూసి బస్సును ఆపడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిని అస్సలు సహించేది లేదు. ఇలాంటి బస్సు డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ట్వీట్‌ చేశారు. కాగా మహిళల కోసం బస్సు ఆపని సదరు డ్రైవర్‌ను గుర్తించి ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
చదవండి: 2 వేల నోటుపై వేటు.. సందేహాలొద్దు.. సమాధానాలివిగో!

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)