Breaking News

కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన.. యువతి కుటుంబానికి రూ.10 లక్షలు..

Published on Tue, 01/03/2023 - 18:28

న్యూఢిల్లీ: ఢిల్లీలో కారుతో ఈడ్చుకెళ్లిన ఘటనలో మృతిచెందిన యువతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. బాధితురాలి కుటుంబసభ్యులకు రూ.10లక్షలు ఆర్థిక సాయంగా అందించనున్నట్లు తెలిపారు.

‍అలాగే ఈ ఘటనలో మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఈ కేసు వాదించేందుకు ప్రముఖ న్యాయవాదిని నియమిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ప్రకటించింది.

ఢిల్లీలోని కంజవాలా ప్రాంతంలో జనవరి 1న ఓ యువతి మృతదేహం నగ్నంగా లభ్యమవ్వడం కలకలం రేపింది. ఐదుగురు యువకులు తాగిన మత్తులో కారు నడుపుతూ ఆమె స్కూటీని ఢీకొట్టారు. యువతి కారు చక్రాల మధ్య ఇరుక్కున్న విషయాన్ని గుర్తించుకుండా కిలోమీటర్లు తిప్పారు. దీంతో ఆమె చనిపోయింది. శరీర భాగాలు తెగిపోయాయి.

ఈ ఘటనకు సంబధించి ఐదుగురు నిందితులను పోలీసులు మరునాడే అరెస్టు చేశారు. బాధితురాలిపై అత్యాచారం కూడా జరిగిఉంటుందని మొదట అనుమానాలు వ్యక్తమైనప్పటికీ.. కారు ఈడ్చుకెళ్లడం వల్లే ఆమె మరణించిందని, ఆమెపై లైంగిక దాడి జరగలేదని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.
చదవండి: 'అంబానీ, అదానీ రాహుల్‌ను కొనలేరు.. నా అన్న వారియర్..'

Videos

బంగారం కొనుగోలుపై మోదీ కీలక వ్యాఖ్యలు

పోలీసుల తీరుపై కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప శ్రీ వాణి

నేపాల్ లో అదృశ్యమైన హైదరాబాద్ వాసి..

పాపం ఆ లీడర్ పరిస్థితి సైలెంట్ గా సైడ్ కు నెట్టేసిన చంద్రబాబు

AP: నాగమల్లేశ్వరి అరెస్ట్

విశాఖలో పుష్ప శ్రీ వాణి అరెస్ట్

పోలీసులు ఆపుదాం అని చూసారు ఇచ్చిపడేసిన పుష్ప శ్రీ వాణి

వాళ్లకు నీళ్లు.. మాకు కన్నీళ్లా..? బాబుకు శిల్ప చక్రపాణి వార్నింగ్

బాబు సభ కోసం బెదిరింపులు.. బయటపడ్డ ఆడియో లీక్

'రోడ్డు బాగు చేసే వరకు లేవను'.. నడిరోడ్డుపై భీష్మ ప్రతిజ్ఞ!

Photos

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

‘కూర్మావతార్‌’ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు