Breaking News

బ్రిటీష్ పాలకుల కంటే బీజేపీ ప్రభుత్వమే ఎక్కువ ప్రమాదకరం!

Published on Fri, 03/24/2023 - 19:09

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై లోక్‌సభ ఎంపీగా అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ చర్యలను అహంకారపూరిత నియంతృత్వ చర్యగా అభివర్ణించారు. ఈ చర్యతో ప్రతిపక్షాల గొంతును భారతీయ జనతా పార్టీ అణిచివేయలేదని నొక్కి చెప్పారు. ఈ మేరకు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్విట్టర్‌లో.. "రాహుల్‌ గాంధీని లోకసభ ఎంపీగా అనర్హత వేటు విధించడం దిగ్భ్రాంతికరం. మేము న్యాయవ్యవస్థను గౌరవిస్తాం.

కానీ రాహుల్‌ని లోక్‌సభ సభ్యుత్వం నుంచి తొలగించడం అనేది పిరికి చర్యే. ఈ తీర్పుతో ఏకీభవించం. ప్రస్తుతం దేశం చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. వారి పాలనతో దేశం మొత్తాన్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారి అహంకార శక్తులకు వ్యతిరేకంగా 130 కోట్ల మంది ప్రజలు ఏకం కావాలి. దేశంలో ఒకే పార్టీ ఉండేలా పరిస్థితిని బీజేపి సృష్టించాలని చూస్తోంది.

దీన్ని నియంతృత్వం అని, స్వాతంత్య్రానికి ముందు భారత్‌ని పాలించిన బ్రిటిష్‌ పాలకులు కంటే బీజేపీ ప్రభుత్వ పాలనే ఎక్కువ ప్రమాదకరంగా ఉంది" అని ట్వీట్‌ చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ అసెంబ్లీలో కూడా నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన నాయకత్వంతో దేశాన్ని నాశనం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీ పనితీరుని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సక్సేనా అడ్డుకుంటూ ఇబ్బందులు సృష్టించారన్నారు. 

(చదవండి: మహాత్మాగాంధీ డిగ్రీ చేయలేదని తెలుసా!:జమ్మూకాశ్మీర్‌ గవర్నర్‌ వ్యాఖ్యలు)

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)