Breaking News

భయపడని 100 మందిని తీసుకుని రేపు వెళ్తాను: కేజ్రీవాల్‌

Published on Mon, 08/03/2026 - 19:35

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం కీలక ప్రకటన చేశారు. తాను మంగళవారం ప్రధాని నివాసానికి వెళ్లి, ఇథనాల్ విధానానికి వ్యతిరేకంగా 2.33 లక్షల మందికి పైగా సంతకం చేసిన వినతిపత్రాన్ని స్వయంగా అందజేస్తానని చెప్పారు.

మీడియాతో కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. "కొన్ని రోజుల క్రితం ప్రధానికి ఉద్దేశించి ఆన్‌లైన్ వినతిపత్రం ప్రారంభించాం. చాలా తక్కువ సమయంలోనే సుమారు 2,33,238 మంది దానిపై సంతకం చేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు నా కార్యాలయం నుంచి 100 మందితో కలిసి ప్రధాని నివాసానికి బయలుదేరుతాను.ఈ వినతిపత్రాన్ని ఆయనకు స్వయంగా అందించి, ఇథనాల్ విధానంలో ఉన్న లోపాల గురించి చర్చించాలని కోరతాం" అని అన్నారు.

అంతకుముందు శనివారం న్యూఢిల్లీ కాన్‌స్టిట్యూషన్ క్లబ్ బయట నిర్వహించిన టౌన్‌హాల్ కార్యక్రమంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. "గతంలో ప్రధానికి ఉద్దేశించిన వినతిపత్రంపై సంతకం చేయాలని మిమ్మల్ని కోరాను. 2,00,000 మందికి పైగా ఆన్‌లైన్‌లో సంతకం చేశారు. ఆ సంతకాల ప్రింట్లను తీసుకున్నాను. మంగళవారం 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు నేను స్వయంగా ప్రధాని నివాసానికి వెళ్లి ఆ వినతిపత్రాన్ని అందజేస్తాను" అని చెప్పారు.

పెద్ద సంఖ్యలో ప్రజలు రావాల్సిన అవసరం లేదని, పోలీసుల చర్యలకు భయపడని వారిని మాత్రమే వెంట తీసుకెళ్తానని అన్నారు. "అందరూ రావాల్సిన అవసరం లేదు. పోలీసుల లాఠీచార్జీకి భయపడని 100 మందిని తీసుకెళ్తాను. జైలుకు వెళ్లడానికి భయపడని 100 మందిని తీసుకెళ్తాను. రావాలనుకునే వారు నాకు రాయండి, నన్ను ట్యాగ్ చేసి సందేశం పంపండి. 100 మందితో కలిసి ప్రధాని నివాసం వైపు పాదయాత్ర చేస్తాం. ఆ తర్వాత ఏమి జరుగుతుందో చూద్దాం" అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)